ప్రజలు సుభిక్షంగా ఉండాలి


Fri,March 22, 2019 03:04 AM

వనపర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, హోళీ రంగుల వలే వారి జీవితాలలో మంచి జరగాలని భగవంతుని కోరుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాజనగరం సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి జన్మదిన వేడుకుల సందర్భంగా మంత్రి దంపతులు పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. మూలవిరాట్‌కు, అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహానికి మంత్రి దంపతులు అష్టాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, పంబారాట్టు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో సీఎం కేసీఆర్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని అన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ రాష్ర్టాన్ని పునర్ నిర్మాణం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూనే, రాష్టాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.

గత పాలకులు రాష్ట్రంలోని సాగును భ్రష్టుపటించారని, తెలంగాణ ఏర్పాటు మొదలు కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రగతి పథంలోకి తీసుకొచ్చారన్నారు. రైతులకు అనేక సంక్షేమ, సబ్సిడీ రూపంలో వ్యవసాయ పరికరాలను అందించారని, దేశ చరిత్రలో రైతుకు పెట్టుబడి సహాయం అందించాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్‌కే వచ్చిందన్నారు. రైతుబీమాతో రైతు కుటుంబాలకు ధైర్యాన్ని నింపిందన్నారు. రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇప్ప డు దేశంలోని ప్రతి రాష్ట్రంతో పాటు దేశ ప్రధాని కూడా ఈ పథకాలనే అమలు చేయడం మొదలు పెట్టారని అన్నారు. కొత్త రాష్ర్టాన్ని ఒక దృఢసంకల్పం, పట్టుదలతో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కేసీఆర్, రానున్న ఎన్నికలలో మన తెలంగాణ నుంచి 16 ఎంపీ సీట్లు గెలిచి దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు ఆయనకు అయ్యప్ప స్వామి ఆశ్వీరాదం అందించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ తప్ప మరే పార్టీకి సాధ్యం కాదన్న విషయం ప్రజలకు అర్థం అయిందని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీని అందించి రెండో సారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్స్ వాకిటి శ్రీధర్, టీఆర్‌ఎస్ నాయకుడు లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీటీసీ విజయమ్మ, ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్ మం డల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...