జూరాలలో డిగ్రీ విద్యార్థుల శ్రమదానం


Fri,March 22, 2019 03:04 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మండలంలోని జూరాల గ్రామంలో ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని పురస్కరించుకొని విద్యార్థులు జూరాలలో రోజుకో కార్యక్రమం చేయనున్నారు. ఈ మేరకు గురువారం గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించి, చెత్తా చెదారాన్ని ఊడ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూర పరిసరాలను పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్ షకీల్‌అహ్మద్, సర్పంచ్ మహిముదా, ఉపసర్పంచ్ మొగిలన్న, విద్యార్థులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...