వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు


Fri,March 22, 2019 03:04 AM

వనపర్తి సాంస్కృతికం : జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం శ్రీలక్ష్మీ అమ్మవారి చిరు నక్షత్రం సందర్భంగా శుప్రబాత సేవ, అమ్మవారికి క్షీరాభిషేకం, స్త్రీయాగంతో పాటు పలు పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకుడు రఘునాథచార్యులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి హోమంలో 108 కమలం పూలతో బిల్వ పత్రాలతో హోమం నిర్వహించామని తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళహరతులతో పల్లకీ సేవ, పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ గోష్ఠి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార చార్యులు, గురు ప్రసాద చార్యులు, రామచంద్రచార్యులు, రాఘవచార్యస్వామి, భరణిసాగరాచార్యులు, గంగాధర్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...