ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలి


Fri,March 22, 2019 03:03 AM

పెబ్బేరు టౌన్ : సమాజంలో ప్రతి ఒక్కరూ సేవభావం కలిగి ఉండాలని, సమాజ సేవలో పాలు పంచుకోవాలని ఎస్‌ఐ విజయ్ కుమార్ అన్నారు. గురువారం పెబ్బేరు మండల కేంద్రంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అంబలి, చలివేంద్రాన్ని ఎస్‌ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు వేసవి దాహర్తి తీర్చుకోవడానికి అంబలి కేంద్రం ఎంతో దోహదపడు తుందన్నారు. వ్యాపార నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు వేసవి తాపంలో ఉన్నవారికి కాస్త ఊరటనిచ్చేందుకు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులను ఆయన అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని వారికి సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, వేమారెడ్డి, ఈశ్వర్, కిషోర్, బాలవర్ధన్, నాగిరెడ్డి, రాజు, సమితి సభ్యులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...