ఘనంగా హోలీ సంబురాలు


Fri,March 22, 2019 03:03 AM

వనపర్తిసాంస్కృతికం/రూరల్/పెద్దమందడి/ఖిల్లాఘణపురం/గోపాల్‌పేట/రేవల్లి/పెబ్బేరుటౌన్ : హోలీ పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో గురువారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, కుల, మత బేధాలకు అతీతంగా అందరు హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. వనపర్తి మండలంలోని నాగవరం, కడుకుంట్ల, చందాపూర్, అంకూర్, శ్రీనివాసపురం, అప్పాయిపల్లి తదితర గ్రామాలలోని యువత, చిన్నారులు, మహిళలలు వీధులోకి వచ్చి రంగులను చల్లుకున్నారు. గ్రామాలలో కొత్త గ్రామ పంచాయతీలలో సర్పంచులు, గ్రామస్తులు, యువకులతో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నారు. అలాగే ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆనందోత్సవాల మధ్య హోలీ సంబురాలను గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు డిజే సౌండ్స్ పాటలకు నృత్యాలు చేశారు. అలాగే పెద్దమందడి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలోని యువకులు, చిన్నారులు, వివిధ పార్టీల నాయకులు హోలీ సంబురాలను గురువారం ఘనంగా జరుపుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఖిల్లాఘణపురం మండలంలోని ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలతో కలిసి హోలీ ఉత్సవాలను జరుపుకున్నారు. అదేవిధంగా ఎస్‌ఐ వెంకటయ్య, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, సర్పంచ్ వెంకటరమణలు చిన్నారులు, యువకులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. గోపాల్‌పేట మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రజలు గురువారం హోలీ పండుగను ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ జానకిరాంరెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్వరీ, సింగిల్‌విండో చైర్మన్ రఘురామారావు, గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతి యాదవ్, ఉమ్మడి మండల టీఆర్‌ఎస్ కన్వీనర్ రామారావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రేవల్లి మండలం కేంద్రంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్, ప్రభుత్వ దవాఖాన సిబ్బంది డా. చిరంజీవి ఆధ్వర్యంలో హోలీ సంబురాలను జరుపుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో డా. పణీంద్ర, నిహరిక, చెన్నారం సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ స్వామిరెడ్డి, శ్రీనివాస్, పుష్ప, పెబ్బేరు ఎస్‌ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...