అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు


Fri,March 22, 2019 03:03 AM

పెద్దమందడి : మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన బోయ సంజమ్మ(70)కునా అనేవారు ఎవ్వరూ లేకపోవడంతో అనాథగా జీవిస్తుండేది. భర్త కొన్నేళ్ల కింద ట చనిపోవడంతో గ్రామంలో ఒక చిన్న గుడిసెను ఏర్పా టు చేసుకొని ఒంటరిగా ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తో జీవనం గడిపేది. ఉన్నట్టుండి ఆమె గురువారం గుడిసెలో చనిపోయి ఉండటాన్ని సమీపంలోని కొందరు గ్రా మస్తులు గమనించారు. గ్రామస్తులు, యువకులు గుడిసె దగ్గరికి వెళ్లి పరిశీలించగా వృద్ధురాలు చనిపోయి ఉండటాన్ని గమనించారు. వృద్ధురాలు అనాథ కావడంతో అం త్యక్రియలు ఎవరూ చేయ్యకపోవడంతో గ్రామంలో ని యువత ముందుకు వచ్చి చందాలు వేసుకొని అంత్యక్రియలకు అవసరమగు సామగ్రిని తీసుకువచ్చి గ్రామ స మీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను చేశా రు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...