చొప్ప కత్తరించు యంత్రాల పంపిణీ


Fri,March 22, 2019 03:03 AM

గోపాల్‌పేట : జిల్లా పశుసంవర్ధకశాఖ ద్వారా ఉమ్మడి మండల పాడి రైతులకు సబ్సిడీపై వచ్చిన చొప్ప కత్తరించు యంత్రాలను గురువారం మండల పశువైద్యాధికారి ఉదయ్‌కుమార్‌రెడ్డి, వీ.ఏ బద్రీనాథ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు 40 శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి మండలంలోని 47 మంది రైతులకు యంత్రాలను అందించినట్లు చెప్పారు. రెండు ఏహెచ్‌పీ, 3 బ్లేడ్ల యంత్రాలు-5, 2 ఏహెచ్‌పీ 3బ్లేడ్ల యంత్రాలు-13, 3ఏహెచ్‌పి 3బ్లేడ్ల యంత్రాలు-29 అందజేయడం జరిగిందన్నారు. ఈ గడ్డి కత్తరించే యంత్రాల ద్వారా సాగు చేసిన పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి పాడి పశువులకు మేతను అందించడం వలన పశుగ్రాసం వృథాను తగ్గించవచ్చన్నారు. పశువులు ఈమేతను బాగా తీసుకొని అధిక పాల దిగుబడిని అందిస్తాయన్నారు. తద్వారా పాడి రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. పంపిణీ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాములు, శివకుమార్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...