దళిత బిడ్డలకు పట్టం


Thu,March 21, 2019 01:43 AM

నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానం దళితులకు రాజకీయ పదవులు కట్టబెడుతూ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను అందిస్తోంది. అదే క్రమంలో అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది.

గద్వాల నుంచి నాగర్‌కర్నూల్‌గా..
తొలుత గద్వాల పేరుతో ఉన్న ఈ ఎంపీ స్థానం 1967ఎన్నికల నుంచి పూర్తిస్థాయిలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంగా కొనసాగుతూ వస్తోంది.
- 1962-67కాలంలో గద్వాల పేరుమీద ఉన్న ఈ స్థానంలో మొదటగా కాంగ్రెస్ నుంచి జె.రామేశ్వర్ రావు ఎంపీగా ఉన్నారు.
- 1967-71నుంచి నాగర్‌కర్నూల్ పేరు మీదగా ఏర్పడిన ఈ స్థానంలో జెబి.ముత్యాలరావు ఎంపీగా పని చేశారు.

ఏడు స్థానాలు
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 15.88లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో అత్యధికంగా ప్రస్తుత ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథ్ 17సంవత్సరాలు ఎంపీగా కొనసాగారు. ఉస్మానియాలో ఈఎన్‌టీ వైద్యునిగా ఉన్న అలంపూర్‌కు చెందిన జగన్నాథ్ తొలిసారిగా 1996ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇక్కడ గెలిచి 1998వరకు పదవిలో ఉంటూ తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. అనంతరం 199-2004, 2004-2009లో టీడీపీ నుంచి, 2009-14లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. మందా జగన్నాథ్ టీడీపీ ఎంపీగా ఉండి అనూహ్యంగా 2009కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పార్టీని ధిక్కరించి యూరేనియం ఒప్పందం విషయంలో యూపీఏకు మద్దతుగా నిలిచారు. అలా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పేరు తెలిసిపోయింది.

స్వరాష్ట్ర ఉద్యమంలో..
తెలంగాణ ఉద్యమంలోనూ జగన్నాథ్ 2014లో పార్లమెంట్‌లో యూపీఏ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను అడ్డుకొన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం తన ప్రత్యేకతను చాటుకొంది. ఆ తర్వాత జగన్నాథ్ టీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
- ఇక మల్లు అనంత రాములు 1980-84, 1989-91మధ్య ఎంపీగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత మల్లు ఆకస్మిక మృతితో సోదరుడు మల్లు రవి రాజకీయంలోకి వచ్చి 1991-96, 1998-99మధ్య రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. అంతకు ముందు 1967-71లో జేబీ ముత్యాలరావు, 1971-77, 77-80లో భీష్మదేవ్ ఎంపీగా ఉన్నారు.

- 1984-89లో వి.తులసీరాం ఒకసారి టీడీపీ నుంచి ఎంపీగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య అనూహ్యంగా ఎంపీగా గెలిచారు. ఇలా గత 57సంవత్సరాల్లో 14పర్యాయాలు జరిగిన ఈ స్థానానికి 8మంది ఎంపీలుగా వ్యవహరించారు. ప్రాంతాలు ఏవైనా పోటీ చేసే అభ్యర్థుల సమర్ధతతో పాటుగా అభివృద్ధి దక్షత కలిగిన వ్యక్తులను ఇక్కడి ప్రజలు ఎంపీలుగా గెలిపిస్తున్నారు. మల్లు అనంతరాములు, మల్లు రవి, నంది ఎల్లయ్యలాంటి వ్యక్తులను సైతం ఆదరించిన చరిత్ర నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికే దక్కింది. మ్తొతంమీద నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రతినిధులను గెలిపించుకొంటోంది. ఈసారి కూడా తెలంగాణ అభివృద్ధికి పట్టం కట్టే అభ్యర్థులకు అందలం కల్పించేలా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...