ఎన్నికల సమాచారానికి 1950 టోల్‌ఫ్రీ నెంబర్


Thu,March 21, 2019 01:41 AM

వనపర్తి అర్బన్: ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లకు తెలియజేసేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఇంత వరకు 385 ఫోన్ కాల్స్ వచ్చాయని జిల్లా ఎన్నికల ,జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల సమాచారాన్ని తెలుసుకునేందుకు గాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1950 టోల్‌ఫ్రీ నెంబర్ , కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కేంద్రం 24 గంటలు పనిచేసేలా నోడల్ అధికారిగా జిల్లా భూగర్భ జలవనరులశాఖ జియా లజిస్ట్ యుగంధర్‌రెడ్డితో పాటు సిబ్బందిని నియమించామని తెలిపారు. షిప్ట్ పద్ధ్దతిన సిబ్బంది విధులు నిర్వహిస్తూ 1950 కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్‌నన్నింటినీ స్వీకరించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవటం, ఓటరు గుర్తింపు కార్డు, ఓటరు జాబితాలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు,పోలింగ్ కేంద్రం వివరాలు బీఎల్‌వో, ఈఆర్వో వివరాలు తదితర వివరాలన్నీ ఈ టోల్‌ఫ్రీ నెంబర్ 1950 ద్వారా తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. 1950కి ఫోన్ చేసి సిబ్బందికి వివరాలు తెలియజేస్తే వెంటనే వారు కోరిన సమాచారాన్ని అందిచడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 1950కి వచ్చే అన్ని కాల్స్‌ను రికార్డు చేయడం జరుగుతుందని ఈ కాల్‌సెంటర్ ద్వారా ఎన్నికల సమాచారంతో పాటు ఓటర్ల స్పందన, ఓటర్లు ఇచ్చే సలహాలు, సూచనలతోపాటు ఫిర్యాదులను కూడా స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కాల్‌సెంటర్ అన్ని రో జుల్లో 24 గంటలు పనిచేస్తుందని .జిల్లాలో ని ప్రజలందరూ ముఖ్యంగా ఓటర్లు 1950 కాల్‌సెంటర్ వినియోగించుకుని ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం సమస్యలు కాని ఉంటే 1950కి ఫోన్ చేయాలని ఆమె కోరారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేస్తే తక్షణమే ఎఫ్‌ఎస్‌టీ,ఎస్‌ఎస్‌టీ బృందాలకు తక్షణమే సమాచారం ఇచ్చి పంపిస్తామని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు 1950 కాల్‌సెంటర్‌కు కొత్త ఓటరుగా నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాల గురించి ,అలాగే ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఎక్కువగా ఫోన్ కాల్స్ వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...