వివాదాలకు..దూరంగా ఉండండి


Wed,March 20, 2019 02:49 AM

వనపర్తి రూరల్ : వివాదాలకు దూరంగా ఉండాలని, పట్టణంలో, గ్రామాలలో అందరూ కలిసిమెలిసి జీవించాలని డీఎస్పీ సృజన అన్నారు. ప్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరు వై వారికి మరింత మెరుగైన భద్రత కల్పించడం కోసమే కార్డన్ సెర్చ్ ప్రతి గ్రామంలో, పట్టణంలోని కాలనీలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రం సమీపంలో ఉదయం 6 గంటలకు శ్రీనివాసపురం గ్రామ శివారులో గల జంగల గుట్ట, పీర్లగుట్ట, టీచర్స్, జర్నలిస్టుకాలనీలలో ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఆమె మాట్లాడుతూ ప్రజలు వివాదాలకు దూరంగా ఉండాలని, అంద రూ కలిసి మెలసి ఉండాలన్నారు. తమ పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా వారి తిరిగే స్నేహితులు ఎవరని, వారు చేస్తున్న పనులు ఎలాంటివి, తదితర వాటిపై దృష్టి సారించాలని గ్రామస్తులకు సూచించారు. గత కొన్ని రోజులు కిందట జరిగిన సంఘటనలను చూస్తే చాలమంది యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి వారు ఏమీ చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితులకు దారి తీస్తుందని తెలిపారు.

మీ చుట్టు పక్కల ఉండే యువత మద్యం, గంజాయి, గుట్కాలు, పొగత్రాగటం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు, అలవాటు పడి జీవితలను పాడు చేసుకుంటున్నారని, గంజాయి తీసుకున్న వారు పోలీసులకు పట్టుబడితే పది ఏండ్లు జైలు శిక్ష, జరిమాన పడుతుందని, అదియే కాక జీవితం మొత్తం నాశనమవుతుందని పేర్కొన్నారు. అటువంటి సంఘటనలు మీప్రాంతంలో జరుగుతుంటే మాకు తెలియజేయాలని, తెలియజేసిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని తెలిపారు. ఎక్కువగా ఈ అలవాట్లకు పదో, ఇంటర్ విద్యార్థులే ఉన్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించి చెడుమార్గంలో వెళ్లకుండ మం చి చదువులు చదివించి ప్రయోజకులుగా అయ్యేలా చూడాలని సూచించారు. కాలనీలో ఎవరైన కొత్తవారు కానీ, ఇంటిలో కిరాయిరూంలో ఉండేవారితో పూర్తి ఆధార్, వారు పనిచేస్తే ఉద్యోగ వివరాలతో కూడిన సమాచారం తీసుకొవాలని తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లలకు బైక్‌లను ఇవ్వరాదని, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండ వాహనాలను నడపరాదని, మైనర్ డ్రెవింగ్‌లో పట్టుబడితే తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు అన్ని ధ్రువపత్రాలు ఉండాలని, కార్డన్ సెర్చ్‌లో పట్టుబడిన వాటికి పత్రాలు చూపి తీసుకెళ్లవచ్చునని తెలిపారు. ప్రస్తు తం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, దానికి లోబడి నడుచుకొవాలని, ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా డబ్బు, మద్యం తదితర వాటిని పంపిణీ చర్యలకు పాల్పడితే సీవిజిల్ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మరేమైన సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని రావాలని ప్రజలకు సూచించారు. కాలనీలలో ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరు కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొవాలని తెలిపారు.
ఈ కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 35 ద్విచక్రవాహానలు, 2 ఆటోలు, ఒక బోల్లోర వాహానం స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సూర్యనాయక్, రూరల్ ఎస్సై రాఘవేందర్ రెడ్డి, పట్టణ ఎస్సై నరేందర్, గోపాల్‌పేట్ ఎస్సై జగన్, పాన్‌గల్ ఎస్సై తిరుపాజీ, ఆరుగురు ఎస్సైలు, 178 మంది పోలీసు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...