సమస్యాత్మక కాలనీలలో కేంద్ర పోలీస్ బలగాలతో కవాతు


Wed,March 20, 2019 02:49 AM

వనపర్తి టౌన్ : త్వరలో జరుగబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక కాలనీలలో జిల్లా పోలీస్ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు. మంగళవారం వనపర్లి జిల్లాలోని అన్ని మండలాలలో పోలీస్ కవాతు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేందర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక కాలనీలలో ప్లాగ్ మార్చ్ నిర్వహించి అక్కడి ప్రజలకు ఎన్నికల విషయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలియజేశారు. ప్రజల రక్షణ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని వారికి భరోసా, నమ్మకం కల్పిస్తు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా సిబ్బంది జిల్లాకు వచ్చిన కేంద్ర బలగాల సిబ్బందితో కలిసి పట్టణంలోని కొత్త బస్టాండ్, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, నందిహిల్స్, కేడీఆర్ నగర్, కొత్తకోట రోడ్డు ఏరియాలో ఈ ప్లాగ్ మార్చ్‌ను నిర్వహించి ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. అనంతరం భగీరథ చౌరస్తా, కొత్తకోట రోడ్డులో కేంద్ర పోలీస్ బలగాలతో కలిసి వనపర్తి పట్టణ పోలీసు సిబ్బంది, పట్టణ ఎస్‌ఐ నరేందర్ వాహనాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...