దేవస్థాన భూములను కాపాడాలని వినతి


Wed,March 20, 2019 02:48 AM

పెద్దమందడి : మండలంలోని దొడగుంటపల్లి గ్రామంలో చేన్నకేశవ దేవస్థానం భూమి 477 సర్వే నంబర్‌కు అనుకొని పక్కనే గుట్టలు ఉండడంతో దానిని కొందరు రైతులు ఆక్రమించుకునేందుకు చదును చేస్తున్నారని గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మంగళవారం తహసీల్దార్ ఘాన్షీరాం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాదాపు 100 ఏండ్ల పైబడి నుంచి చెరువు కొనకట్ట భాగంలో ఎర్రమన్ను గుట్ట ఉండేదని దానిని కొంతమంది రైతులు చదును చేసి అక్రమణకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు దానిలో గుట్ట భాగంలో తమ పశువులకు పాకలు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా దొడగుంటపల్లి గ్రామం నుంచి అంకూర్ గ్రామానికి రోడ్డు ఉండడంవల్ల ఆ గుట్టను చదును చేసేటప్పుడు బండరాళ్లు రోడ్డుకు వేయడం వల్ల వెళ్లే రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో వార్డు సభ్యుడు బీరయ్య, రైతులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జానకీరాములు, గోపాల్, సురేష్, సుదర్శన్, వెంకటేశ్వర్‌రెడ్డి, బాలపీరు, వెంకటయ్య, రాములు, జమ్ములు తదితరులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...