మాటు వేసి సీజ్ చేసి


Wed,March 20, 2019 02:48 AM

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడుతోందని, వారికి నకిలీ విత్తనాలు విక్రయించి మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయాధికారి బైరెడ్డి సింగారెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని హైద్రాబాద్ చౌరస్తా జీనియస్ పాఠశాల సమీపంలోని వీరాంజనేయులు ఇంట్లోనే నకిలీ పత్తి విత్తనాలను తయారుచేసి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మల్లారెడ్డి, శ్రీధర్, భూపాల్, సురేశ్‌లు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న డీఏవో సింగారెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించగా అతడి ఇంట్లో 26.07 క్వింటాళ్ల తయారీ కాని పత్తి విత్తనాలు, 4.92 క్వింటాళ్ల ప్యాక్‌డ్ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. 14వేల ప్యాకింగ్ కవర్స్, 13 క్యాన్ల కెమికల్ కవర్స్, దాదాపు రూ.60లక్షల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. సోదాల అనంతరం విలేకరులతో డీఏఓ మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే విత్తనాలు విక్రయించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పని సరిగా రశీదు పొందాలని సూచించారు. ఎన్‌ఫోర్‌సమెంట్ దాడుల్లో కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నర్సింహులు, ఏవోలు శ్రీలత, మంజుల, ఆర్‌ఐ శశి, ఏఈవోలు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...