ప్రజలను మోసం చేయాలని చూస్తే చట్టం ఊరుకోదు


Wed,March 20, 2019 02:48 AM

జడ్చర్ల రూరల్ : వ్యాపారాల పేరుతో ప్రజల నె త్తిన కుచ్చుటోపి పెట్టి తప్పించుకోవాలని చూస్తే చట్టం వదిలిపెట్టదని సీఐ బాల్‌రాజ్‌యాదవ్ హెచ్చరించారు. 2013 సంవత్సరంలో జడ్చర్ల పట్టణంలో రైస్‌మిల్ వ్యాపారంలో పలు వ్యాపారులు, ఎస్‌బీహెచ్ బ్యాంకుకు దాదాపు రూ.6 కోట్లు కుచ్చుటోపి పెట్టి పారిపోయిన వ్యాపారి ప్రకాష్‌ను మంగళవారం విలేకరుల ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల పట్టణంలో 2004వ సంవత్సరంలో లక్ష్మీనరసింహ్మ రైస్‌మిల్ పెట్టి మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ల ద్వారా వ్యాపారం చేసి వారికి దాదాపు రూ.1.30కోట్లు అప్పు చేయడమే కాకుండా బాదేపల్లి ఎస్‌బీహెచ్ బ్యాంకు నుంచి రూ.4.50కోట్లు కొత్త మిషనరీ కోసం రుణంగా తీసుకున్నాడని తెలిపారు. అనంతరం వ్యాపారులు రుణం చెల్లించాలని ఒత్తిడి తేవడంతో 43మందికి చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్ అయ్యాయని అన్నారు. అనంతరం కమీషన్ ఏజెంట్లతో తనకు ధాన్యం ఇవ్వాలని వాటిని మిల్లులో ఆడించి వారికి రుణాలు చెల్లిస్తానని చెప్పి 17 ఫిబ్రవరి 2013న రాత్రికి రాత్రి పారిపోయాడన్నారు. నిందితుడిపై వ్యాపారి బాలస్వామి ఫిర్యాదు చేయడంతో నిఘావేసి సోమవారం రాత్రి జడ్చర్ల కొత్తబస్టాండ్‌లో ఉండంగా అతనని గుర్తించిన పోలీసులు పట్టుకుని విచారించినట్లు తెలిపారు. నిందుతుడు ప్రకాష్‌ను పట్టుకోవడంలో టీంవర్క్ చేసిన హెడ్‌కానిస్టేబుల్స్ రవి, సక్రునాయక్, కానిస్టేబుల్స్ మల్లిఖార్జున్, పవన్‌లను ఆయన అభినందిచారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...