ఏటీడీవో, హెచ్‌ఎం సస్పెన్షన్


Wed,March 20, 2019 02:48 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : జిల్లాకు చెందిన అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రాములు, కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజును సస్పెండ్ చేస్తు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలోకి వెళ్తే.. కల్వకుర్తి పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఈ నెల 8న రాష్ట్ర గిరిజన సంక్షేమ సంచాలకులు క్రిస్టియానా తనిఖీ చేయగా ఆ సమయంలో తరగతి గదులు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై సీరియస్ అయిన క్రిస్టినా, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు సిఫారసు చేశారు. క్రిస్టినా ఆదేశాను సారం , జిల్లా కలెక్టర్ ఆమోదంతో విధుల పట్ల నిర్లక్షం వహించిన ఏటీడీవో రాములు, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం బాలరాజులను సస్పెండ్ చేశామని అఖిలేష్‌రెడ్డి చెప్పారు. రాములు స్థానంలో జంగారెడ్డి ఆశ్రమ పాఠశాల శంకర్‌కు ఇన్‌చార్జి ఏటీడీవో బాధ్యతలు అప్పగించామని అఖిలేష్‌రెడ్డి పేర్కొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...