రోడ్డు నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలి


Wed,March 20, 2019 02:47 AM

మహబూబ్‌నగర్ క్రైం: రహదారులను ప్రమాదరహితంగా నిర్మిస్తూ, ఆత్మీయులను దగ్గరకు చేర్చే నేస్తాలుగా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రైళ్లు, రహదారుల భద్రతా శాఖ అదనపు డీజీపీ సందీప్ శాండిల్యా అన్నారు. జిల్లాకు విచ్చేసిన అదనపు డీజీపీకి పోలీసు సిబ్బంది గౌరవవందనం చేశారు. వికారాబాద్‌తో సహా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో అదనపు డీజీపీ రోడ్డు భద్రతకై తీసుకొనవలసిన పలు ఆంశాలపై చర్చించారు. మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్లపై దూకుడుగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తేనే అమాయకులకు రక్షణ కల్పించినవారమవుతామన్నారు. సుప్రీం కోర్టు కూడా రహదారి నిబంధనలు పట్ల ప్రత్యేకదృష్టి సారించటమే గాక చట్టాలను కఠినతరం చేసిన విషయాన్ని ప్రజలకు చేరేలా ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామస్థాయి నుంచి జాతీయ రహదారుల దాకా ప్రమాద కారకంగా ఉన్న ప్రదేశాల వివరాలు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖకు అందిజేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై చేసే ప్రతి ప్రయత్నము, ఒక కుటుంబాన్ని తీవ్రమైన దుఖం నుంచి కాపాడుతుందనే భావన సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ రెమారాజేశ్వరి, గద్వాల ఎస్పీ లక్ష్మీనాయక్, వికారాబాద్ ఎస్పీ నారాయణ, నారయణపేట ఎస్పీ చేతన, ఆడిషినల్ ఎస్పీలు వెంకటేశ్వర్లు(య.నగర్), జె.చెన్నయ్య(నాగర్‌కర్నూల్), వనపర్తి డీఎస్పీ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...