సర్కారు బడుల్లో చక్కని బోధన


Tue,March 19, 2019 03:32 AM

వనపర్తి రూరల్ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు పాఠలను బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వనపర్తి మం డలంలోని చిట్యాల తూర్పుతండా గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు వినూత్నరీతిలో విద్యార్థులకు విద్యను అందిస్తూ వారిని చక్కగా తీర్చిదిద్దుతూ గురుకుల పాఠశాలలకు ఎంపిక అయ్యేలా కృ షి చేస్తున్నారు. తండా నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుం డా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తూన్నారంటే ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎంత చక్కటి విద్యబోధన చేస్తూన్నారో అర్థం చేసుకొవచ్చు తరగతి గదిలో పాఠ్యాంశాలతోపాటు ఇతర అంశాలను విద్యార్థులకు బోధిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఉపాధ్యాయులు ఈ పాఠశాల విద్యార్థులకు విద్యాతోపాటు చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన, మట్టిబొమ్మల తయారీలో వారికి శిక్షణ అందిస్తూ వారిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.

గురుకులపై ప్రత్యేక శిక్షణ
ఐదేళ్లుగా గురుకులలో శిక్షణ ఇస్తు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గ దర్శకులవుతున్నారు. 2013 నుంచి ఈ పాఠశాల ఉపాధ్యాయులు అందరి మాదిరిగా కాకుండా గిరిజన ప్రాంత విద్యార్థులకు వారికి ఉండే అవకాశాలను అందించాలన్న సంకల్పంతో అనుకున్న తరుణమే విద్యార్థులకు వారి సొంత డబ్బులతో విద్యార్థులకు గురుకుల కొచింగ్ మేటిరియల్ తీసుకొచ్చి శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. అది మొదలు ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులను గురుకుల పాఠశాలలకు ఎంపికైయ్యారు. ఈ ఏడాది 12 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ తండాలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకుండ పోయింది. అదికాకుండ బతుకుదెరువుకు వెళ్లి గ్రామాస్తులు తమ పిల్లలను తిరిగి గ్రామంలోని పెద్ద వాళ్ల వద్దనే విడిచిపెట్టి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే పరిస్థితికి వచ్చారంటే ఆ పాఠశాలలో అందించే విద్యబోధన ఏలా ఉందో ఆర్థం చేసుకొవచ్చు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...