వడదెబ్బ తగులకుండా జాగ్రత్తలు తీసుకోండి


Tue,March 19, 2019 03:31 AM

వనపర్తి అర్బన్ : ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి హామీ సిబ్బంది పనిచేస్తున్న ప్రాంతంలో, పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ శ్వేతామొహంతి సూచించారు. సోమవారం తన ఛాంబర్లో రాష్ట్ర విపత్తులు నిర్వహణ శాఖ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ద్వారా వడదెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండాకాలంలో ఆరుబయట పని చేసేవాళ్లు సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి నీళ్లు తీసుకెళ్లాలని, ఎక్కువశాతం నిమ్మరసం, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, పలుచని వస్త్రాలను ధరించాలని, పలుచని మజ్జిగ, గ్లూకోజు నీళ్లు, చిటికెడ్ ఉప్పు పంచదార ఒక గ్లాసులో కలుపుకుని ఇంటిలోనే తయారు చేసుకుని ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్బిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ తగిలితే వెంటనే దగ్గరలోని దవాఖానకు తీసుకెళ్లి ప్రథమ చికిత్సను అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి, సీపీవో రవీందర్ రెడ్డి, డీసీడీవో శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...