ఖర్చుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి


Tue,March 19, 2019 03:30 AM

-ఏప్రిల్ 1న అభ్యర్థుల ఖాతాలపై మొదటి విడత తనిఖీ
-లోక్‌సభ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు ఏకే మోరియా
నాగర్‌కర్నూల్ టౌన్ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని లోక్‌సభ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు ఏకే. మోరియా అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి కార్యాలయ సమావేశ మందిరం లో నియోజవకర్గాల ఎక్స్‌పెండేచర్ మానిటరింగ్ కమిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బృందంగా ఏర్పడి ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. విధుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తానని తెలిపారు. సహాయ ఎక్స్‌పెండేచర్ అధికారులు, వీడియో సర్వే లెన్స్, వీడి యో వీవింగ్, లెక్కల నిర్వాహణ బృందాలు వాటి విధులు తదితర అంశాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా, జమ చేసిన అనుమానస్పద బ్యాంక్ ఖాతాలపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీన అభ్యర్థులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలపై మొదటి తనిఖీ ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో నోడల్ అధికారి వెంకట్, అదనపు ఎస్పీ చెన్నయ్య, అచ్చంపేట, కొల్లాపూర్ ఏఆర్‌వోలు, ఆర్డీవోలు పాండు, హనుమానాయక్, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు ఉన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...