గందరగోళానికి గురికావొద్దు


Tue,March 19, 2019 03:30 AM

-పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
-పార్టీ శ్రేణులెవ్వరూ ఆందోళన చెందొద్దు
-పనిచేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది
-మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
-కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం
కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : కొందరు పనిగట్టుకుని కావాలని తప్పుడు ప్రచారాలను సృష్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సోమవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇతరులు కావాలని కుట్రపూరితంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ నమ్మొద్దన్నారు. పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారు.. కానీ పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరం పనిచేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ నాగర్‌కర్నూల్ జిల్లా చైర్మన్ విష్ణు, జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, చిన్న నిరంజన్‌రావు, సర్పంచులు సత్యం, రమేష్‌రావు, టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, తాలూకా యూత్ వింగ్ ఇన్‌చార్జి ధర్మతేజ, నాయినోనిపల్లి మైసమ్మ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, ప్రతాప్‌గౌడ్ తదితరులున్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...