బ్రాంచ్ కెనాల్ ఏర్పాటుకు సర్వే పనులు


Tue,March 19, 2019 03:30 AM

-కాలువ పూర్తైతే 1500 ఎకరాలకు సాగు నీరు
-సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి
గోపాల్‌పేట : మండలంలోని అదనపు ఆయకట్టుకు ఎంజీకేఎల్‌ఐ సాగు నీటిని అందించేందుకు గాను బుద్దారం గండి వద్ద మాలవాగుకు అడ్డంగా కట్ట వేసి డైవర్షన్ కాలువను ఏర్పాటు చేశారు. ఈ కాల్వ ద్వారా బుద్దారం, పొల్కెపహాడ్, గోపాల్‌పేట గ్రామాలతో పా టు తండాల్లో ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇప్పటికే ఈ కాల్వ ద్వారా బుద్దారం శివారులో వేరుశనగ, వరి పంటలు సాగు చేశారు. పొల్కెపహాడ్ శివారుకు సాగు నీళ్లు అందించేందుకు గాను బుద్దారం-పొల్కెపహాడ్ బ్రాంచ్ కెనాల్ ఏర్పాటుకు సర్వే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను సోమవారం సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి, సర్పంచ్ రజనిరాజ్, మాజీ సర్పంచ్ సత్యశీలారెడ్డి, రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి మా ట్లాడుతూ బ్రాంచ్ కెనాల్ ఏర్పాటుకు సర్వే, కాలువ పనులు ఇంతవరకే పూర్తి చేయాల్సి ఉండగా, రైతులు పంటలు సాగు చేసుకోవడంతో కొంత ఆలస్యం కావడం జరిగిందన్నా రు. ప్రస్తుతం సర్వే పనులు రైతుల సహకారంతో సజావుగా సాగుతున్నాయన్నారు. సర్వే పూర్తి అయిన వెంటనే కాలువ పనులు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి మిగిలిపోయి న ఆయకట్టుకు ఎంజీకేఎల్‌ఐ నీటిని అందిస్తామన్నారు. ఈ కాలువ ద్వారా గ్రామ శివారులో సుమారు 15 వందల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదనపు ఆయకట్టుకు సాగు నీటిని అందించేందుకు కృషి చేసిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రాములు, శేఖర్, ఆంజనేయులు, శివుడు, శ్రీశైలం, చంద్రయ్య, బండలయ్య తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...