వృద్ధుల ఆరోగ్యానికి భరోసా..


Fri,February 22, 2019 12:16 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రజలందరికి కంటి పరీక్షలు చేయిస్తున్న ప్రభుత్వం ఇతర అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా పెద్ద వయసున్న వారి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటోంది. గ్రామ గ్రామానా కంటి పరీక్షలు నిర్వహించి విజయవంతంగా కంటి అద్దాలను అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమం చివరి దశకు చేరింది. ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ)అసంక్రమిత వ్యాధులపైన గ్రామాల్లోని వృద్ధులకు చికిత్సలు నిర్వహించి విలేజ్ హెల్త్ ప్రొఫైల్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తోం ది. జిల్లా వ్యాప్తంగా సబ్‌సెంటర్లు, గ్రామాల వారీ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సేకరించిన ఆరోగ్య వివరాలను ఆయుస్మాన్ భారత్ అభియాన్ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వృద్ధాప్యం లో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నది. 30 ఏళ్లకు పైబడిన వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం చుకుని ప్రత్యేకంగా వృద్ధుల కోసం ప్రభుత్వ ఆరో గ్య క్లినిక్‌లను నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వనపర్తి జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన కొత్త జిల్లాలన్నిటికి 2వ దఫాలో ఎన్‌సీడీ పథకంలో అవకాశం కల్పించారు. మొదటి దఫాలో కేవలం పది జిల్లాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అంచెలంచెలు గా అన్ని జిల్లాల్లో వృద్ధుల క్లినిక్‌లకు అవకాశం కల్పిస్తున్నది. రెండో దఫాలోను ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 5 కొత్త జిల్లాలను ఈ పథకంలోకి చేర్చింది. 15 రోజులుగా జిల్లాలో ఈ పథకం కిం ద వృద్ధులకు ప్రత్యేక చికిత్సలను చేపడుతున్నారు. ఈ క్లినిక్‌లో నయం కాకుంటే మెరుగైన వైద్యం కోసం ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు పంపించి అవసరమైన చికిత్సలను అందించనున్నారు.

ఇంటికి వెళ్లి పరీక్షలు..
జిల్లా సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామాలకు వెళ్లి వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో దాదాపు 104 సబ్ సెంటర్లున్నాయి. వాటి పరిధిలోని గ్రామాలన్నిటిలోను ఈ చికిత్సలు నిర్వహిస్తున్నారు. 5 వేల జనాభాకు ఒక్క సబ్‌సెంటర్ చొప్పున ఏర్పాటు కాగా, చిన్న గ్రామాలైతే రెండు మూడును కలిపి సబ్‌సెంటర్ పరిధిలో కొనసాగుతున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ చికిత్సలను కొనసాగిస్తున్నారు. హెల్త్ ప్రొఫైల్ సేకరణలో ఇప్పటి వరకు జిల్లాలోని 146 గ్రామాల్లో వివరాలు సేకరించారు. ఇంకా 97 గ్రామాల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ద్వారా వృద్ధుల వివరాలను సేకరించాల్సి ఉంది. జిల్లాలో 30 ఏళ్ల పైబడిన వారు దాదాపు రెండున్నర లక్షల వరకు ఉంటారని అంచనా ఉంది.

నిర్వహించే పరీక్షలు ఇవే..
వృద్ధుల క్లినిక్‌లో ప్రధానంగా వినికిడి లోపం, చర్మ సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, చూపు మందగించడం, దంత సమస్యలు, క్యాన్సర్ కారక వ్యాధులను గుర్తించే పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఇంటికి వెళ్లి చేపడుతున్న పరీక్షల్లో ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ కారక వ్యాధులు బయట పడితే వాటికి తగిన పరీక్షలు చేసేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లుగా ఈ వృద్ధుల ప్రత్యేక చికిత్సలను కొనసాగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

నిరుపేదలకు ఆసరా..
వృద్ధులకు ప్రత్యేకంగా చేపట్టిన చికిత్స కార్యక్రమం గ్రామాల్లోని నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న పేదలకు ఏ ప్రభుత్వం కంటి పరీక్షలు చేయించిన దాఖలాలు లేవు. కేవలం కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ పరీక్షలపైన నజర్ పెట్టి అమలు చేశారు. ఇదే తరహాలోను నేడు వృద్ధుల కోసం మరో పథ కం ద్వారా చికిత్సలకు శ్రీకారం చుట్టారు. వృద్ధా ప్య దశలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ రావడం సహజం. మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటు లో లేక దవఖానాల్లో చూపించే ఆర్థిక స్థోమతలేని వృద్ధులు ఆరోగ్య సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నా రు. ఇలా గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...