వస్తువుల నాణ్యతపై విస్తృతంగా తనిఖీ


Fri,February 22, 2019 12:14 AM

వనపర్తి విద్యావిభాగం : నాణ్యమైన వస్తువుల అమ్మకాలు, వినియోగంపై పరిశీలించేందుకు ఫు డ్ సేఫ్టి ఆండ్ స్టాండెడ్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు జిల్లా కేంద్రంలో ని దుకాణ సముదాయంలోని వస్తువులను పరిశీలించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రాష్ట్ర నోడల్ అధికారులు అశోక్ కుమార్, రాష్ట్ర నోడల్ మొబైల్ స్టాం డెడ్ నోడల్ అధికారి లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో 8 మంది సభ్యులు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నాణ్యవంతమైన ఆహారంతో ఆరోగ్యకరమైన భారత్‌ను తయారు చేయాలనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 10 రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిందని ఆయన చెప్పారు. అందులో భాగంగా ప్రజలు (వినియోగదారులు), విక్రయదారులు (అమ్మకందారులు) నాణ్యమైన వస్తువులను అమ్మాలి, కొనాలని అవగాహన కల్పించడం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లాంటి ఆంశాలతో ఈ మొబైల్ టీమ్‌లు పనిచేస్తున్నాయని వారు చెప్పా రు. వస్తువుల నమునాలు సేకరించి ప్రయోగశాలకు పంపించి వాటి నివేదికల ఆధారంగా నాణ్యమైన వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయో లే దో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

మొ దటి విడతగా మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి చొరవతో తెలంగాణ రాష్ట్రంలో దుకాణ సముదాయాలలోని వస్తువులను సేకరిస్తున్నామన్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, సూర్యపేట లాంటి ప్రధాన నగరాల్లో షాంపిల్ సర్వేను చేస్తున్నామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శంకర్‌గంజ్‌లోని దుకాణ సముదాయంలో లేబుల్ లేని వస్తువులను, మ్యాను ప్యాక్చరింగ్, వాటి తేదీలను గమనించారు. నాణ్యమైన లేబుల్ లేని వస్తువుల రికార్డులను అధికారులు విసిరి పారేశారు. కొన్ని నమునాలను మొబైల్ ల్యాబ్‌లకు తీసుకెళ్లి పరిక్షించారు. అక్కడే ఉన్న టీ కొట్టులో చాయిపత్తాను పరిక్షించారు. కూరగాయల మార్కెట్లో కుల్లిన కూరగాయాలను విక్రయించరాదని విక్రయదారులకు సూచించారు. షాపులలో నమునాలు సేకరిస్తుండగా పక్కనే ఉండే దుకాణ సముదాయాలన్ని ఒక్కొక్కటిగా యజమానలు మూసివేశారు. కొన్ని షాపులలో నకిలీ(నాణ్యత లేని వస్తువులను) అమ్ముతున్నారని వ్యాపారస్తులకు సూచించారు. ల్యాబ్ ద్వారా నకిలీవని నిర్దారణ అయితే భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడానికి వెనకాడమని అన్నారు. ఈ నమునా సేకరణ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టి ఉమ్మడి జిల్లా అధికారి ధర్మేంద్ర, ల్యాబ్ టెక్నిషియన్ భాస్కర్, సిబ్బంది వాజీద్, రాజు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...