మంత్రి నిరంజన్‌రెడ్డికి.. అభినందనల వెల్లువ


Fri,February 22, 2019 12:14 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ వనపర్తి అర్బన్/ వనపర్తిరూరల్/ ఖిల్లాఘణపురం/ పెబ్బేరు/ పెబ్బేర్‌టౌన్/ గోపాల్‌పేట/ రేవల్లి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లోని సచివాలయం చాంబర్‌లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11:25 గంటలకు శాఖ కార్యాలయంలో మంత్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మం త్రులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పి.రాములు అభినందించిన వారిలో ఉన్నారు. గతంలో వ్యవసాయ శాఖ మం త్రిగా పని చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే కా ర్యాలయం నుంచి విధులను నిర్వహించారు. నేడు అదే కార్యాలయంలో కొత్త మంత్రిగా నిరంజన్ రెడ్డి తన గురుతర బాధ్యతలు చేపట్టారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వనపర్తి నుండి పలువురు టీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు నిరంజన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, పూలబొకే అందజేశారు. అనంతరం టీఆర్‌ఎస్ రాష్ట్ర యువజ న విభాగం నాయకులు మేడిపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌లు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఖిల్లాఘణపురం మండంలోని మానాజీపేట, సోలీపూర్, మామిడిమాడ, రుక్కన్నపల్లి, అల్లమాయిపల్లి, గిరిజన తండాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీపీ కృష్ణానాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ వెంకట్రావు, మన్యంగౌడ్, జాతృనాయక్, రంగారెడ్డి, మురళీధర్‌రెడ్డి, భూమయ్యలు మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరంగాపురం మం డల నుంచి రైతు సమితి అధ్యక్షుడు గౌడ నాయక్‌లు కలి సి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తకోట ఎంపీపీ గుం త మౌనిక మల్లేష్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ కొం తం గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సంబు రవి కుమార్‌శెట్టిలు శాలువా పూల మాలలతో సన్మానించారు. జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఉపాధ్యక్షులు కందూరు చంద్రయ్య యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు గాజుల కోదండం,కరోళ్ల భాస్కర్, ఎద్దుల గోపా ల్, జిల్లా గిరిజన నాయకులు నారాయణ, ఉస్మన్, శ్రీధర్‌గౌడ్, తల్పునూర్ సర్పంచ్ గుద్దటి నరేందర్‌రెడ్డి, మాజీ టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి వన్నోజు సాయిప్రకాష్, శేఖర్‌రెడ్డి, బాల్‌లింగం,రాజవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, ఆవుల రమేష్, పాకనాటి కృష్ణయ్య, మహిళా కౌన్సిలర్లు కమలమ్మ, ఎస్‌కే. ఖైరూన్, ఇందిరమ్మ, ప్రమీలమ్మ, దొడ్ల రా ము లు, కాగితాల లక్ష్మీనారాయణ, బిస్తి శ్రీను, కడం శేఖ ర్, నారాయణ దాసు కిట్టు, నాగేశ్వర్‌రావు ఉన్నారు.

విద్యాశాఖ మంత్రికి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు రాములు, స్వర్ణసుధాకర్‌రెడ్డి, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, పెబ్బేర్ జడ్పీటీసీ ప్రకాష్, మాజీ మార్కెట్ క మిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు కొదం డ రామిరెడ్డి, మండల అధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు సన్మానించారు.

ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరాలి
ఖిల్లాఘణపురం: ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజలకు చేరాలని, ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ శ్వేతామొహంతి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండలంలోని కమాలుద్దీన్‌పూర్‌లో ప్రభుత్వ దవాఖానను డీఎంహెచ్‌వో శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా దవాఖాన పరిధిలోని గ్రామాల వారీగా ఏఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్లతో ఆయా గ్రామ పరిధిలోని మహిళల కాన్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్‌కార్డు ఆధారంగా ఏ గ్రామంలో చూసినా చాలా మంది ప్రైవేట్ దవాఖానల్లోనే కాన్పులు చేయించుకున్నట్లు రికార్డుల్లో కలెక్టర్ గమనించారు. దీంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేయించకుండా ప్రైవేట్‌కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామంలోని మహిళలతో సన్నిహిత్యం మెరుగుపరుచుకోవాలని, గర్భిణిగా ఉన్న మహిళ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ప్రసవమయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎన్‌ఎమ్‌లకు, ఆశ వర్కర్లకు సూచించారు. గర్భిణుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. గర్భిణుల వివరాలు, ప్రసవాల వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ కల్పిస్తున్న అన్ని వసతుల గురించి గ్రామస్తులకు వివరించాలన్నారు. గర్భిణులకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే 102కు సమాచారం ఇచ్చి వారిని దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులను లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. మీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లే మహిళలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిపట్ల మర్యాదపూర్వకంగా ఉన్నప్పుడే రోగులకు వైద్యులపై నమ్మకం కలుగుతుందన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పింస్తోందన్నారు. వాటిని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకొని ప్రజలకు సేవలు చేయాలన్నారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రోడ్డుమీదితండాకు చెందిన ఆశవర్కర్ అలివేల రికార్డులో గర్భిణుల వివరాలు, ప్రసవాల వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఎంహెచ్‌వో శ్రీనివాసులుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సాయిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

బాధితునికి ఎల్‌ఓసీని అందజేసిన మంత్రి
వనపర్తి అర్బన్ : అనారోగ్యం బారిన పడ్డ బాధితుడి కుటుంబసభ్యులకు రూ. 2లక్షల 50 వేలు ఎల్‌వోసీ పత్రాలను గురువారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అందజేశారు. అమరచింత మండల కేంద్రానికి చెందిన గౌతమ్‌కు చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం ముందస్తుగా ఎల్‌వోసీ మంజూరు చేయించారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...