మంత్రి పదవి రావడం సంతోషకరం


Wed,February 20, 2019 11:25 PM

వనపర్తి అర్బన్/రూరల్/ఖిల్లాఘణపురం/పెద్దమందడి : వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని 17వ వార్డు కౌన్సిలర్ రమేష్ నాయక్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర సభ్యులు హైదరాబాద్‌లోని మంత్రి నివాస గృహంలో బుధవారం వేర్వేరుగా కలిసి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా గొప్ప పదవి రావడం సంతోషకరమని, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషితో వనపర్తి జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు గిరి, విష్ణుసాగర్, పట్టణ ప్రచార కార్యదర్శి మురళిసాగర్, నాయకులు పాషలు, రాములు నాయక్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వనపర్తి ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ వెంకటేష్, రవి కుమార్ తదితరులు ఉన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత ఆధ్వర్యంలో అధికారులు పూర్ణచందర్ రెడ్డి, కురుమయ్య తదితరులు నిరంజన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జాతృనాయక్ తన మిత్రబృందంతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి పూలబొకేతో శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో.., రాష్ట్ర ప్రజలకు చేరువై మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అలాగే పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి ఎంపీటీసీ నాగేందర్‌రావు, సింగిల్‌విండో డైరెక్టర్ లక్ష్మణ్‌గౌడ్, వార్డు మెంబర్ జ్యోతి హైదరాబాద్‌లోని మంత్రి నిరంజన్‌రెడ్డిని తన ఇంటి వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను, శ్రీధర్, భీంరెడ్డి ఉన్నారు.

బాధితుడికి ఎల్‌వోసీ అందజేసిన మంత్రి
పెబ్బేరు రూరల్ : అనారోగ్యం బారిన పడ్డ బాధితుడికి రూ.75 వేల ఎల్‌వోసీ పత్రాలను బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అందజేశారు. పెబ్బేరు మండలం జనుంపల్లికి చెందిన శేషయ్య చికి త్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ముందస్తుగా ఎల్‌వోసీ మంజూరు చేయించారు. ఈ పత్రాన్ని నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లో బాధితుడి కుటుంబ సభ్యుడికి అందజేశారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...