మామిడిమాడ గ్రామంలో సంత ఏర్పాటు


Wed,February 20, 2019 11:25 PM

ఖిల్లాఘణపురం : మండలంలోని మామిడిమాడ గ్రామంలో బుధవారం వారంతపు సంతను గ్రామ సర్పంచ్ మోహన్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకట్రావులు కలిసి ప్రారంభించారు. సంత ప్రారంభమైన మొదటి రోజు దాదాపు 70 దుకాణాలకు పైగా వ్యాపారస్తులు ఏర్పాటు చేశారు. ఈ సంతలో కూరగాయలు, దుస్తులు, ఆట వస్తువులు, సరుకులు తదితర వాటితో పాటు నిత్యవసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచారు. గ్రామంలో సంతను ఏర్పాటు చేయడంతో కొనుగోలు చేసేందుకు సల్కలాపూర్, సల్కలాపూర్ తండా, ఆప్పారెడ్డిపల్లి, పర్వతాపుర్, వెనకితండా, ముందరితండా, మేడిబాయితండా, బక్కతండాలతో పాటు బిజినెపల్లి మండలం లట్టుపల్లి గ్రామస్తులు, గిరిజన తండాల ప్రజలు సంతకు చేరుకొని వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మామిడిమాడ గ్రామంలో సంత ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులకు నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఎంతో సులువుగా ఉంటుందన్నారు. సంతలో మౌలిక వసతులు కల్పించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహాకారంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మామిడిమాడ గ్రామంలో ప్రతి బుధవారం సంత కొనసాగుతుందని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, నాయకులు కృష్ణయ్య, బాలీశ్వర్‌రెడ్డి, గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...