నిత్యకృషీవలుడికి నీరాజనం


Wed,February 20, 2019 03:03 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్యే సింగిడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేసి కొత్త చరివూతను సృష్టించారు. జిల్లాల పునర్విభజన అనంతరం వనపర్తి నుంచి తొలి మంత్రిగా నిరంజన్‌డ్డి నమోదు చేసుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓట్ల శాతాన్ని తన ఖాతాలో వేసుకున్న నిరంజన్‌డ్డి ముందు నుంచి పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అలంపూర్ జోగుళాంబ నుంచి గద్వాల దాకా చేపట్టిన పాదయాత్ర మొదలుకొని మొన్నటి ఎన్నికల్లో తొలి ప్రజా ఆశీర్వాద ఉమ్మడి జిల్లా సభను వనపర్తిలో ఏర్పాటు చేసే వరకు ఉద్యమ రథసారథిగా, సీఎం కేసీఆర్‌కు నిరంజన్ రెడ్డి వెన్నంటి నిలిచిన ప్రాధాన్యత బహిరంగంగానే కనిపిస్తుంది. వనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన నిరంజన్‌డ్డి మొన్నటి ఎన్నికల్లో కొత్త చరివూతకు పునాది వేశారు.

గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థికి ఇవ్వాని మెజార్టీని ప్రజలు నిరంజన్‌డ్డి కి అందించారు. లక్షా12వేల ఓట్లను తమ ఖాతా లో వేసుకొని ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ఓట్ల శాతం అందుకున్న ఎమ్మెల్యేగాను నిలిచారు. వనపర్తి నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో సాగుకు నిలయంగా చేసిన ఆయన రైతుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. పల్లెబసతో నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాల్లోనే నిద్రించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొన్నారు.

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఊతం..
ఉద్యమనేతగా ఉమ్మడి జిల్లాలో నిరంజన్ రెడ్డి తిరగని ఊరు లేదు.. తొక్కని గడప లేదు. అత్యధిక గ్రామాల్లో పర్యటించారు. అన్ని ప్రాంతాల సమస్యలు ఆయన తెలుసుకున్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తే అన్ని అవకాశాలున్న నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. అలాగే మెడికల్ కళాశాలను మహబూబ్‌నగర్‌కు మంజూ రు చేయాలన్న దానిపై సహాకారమందించారు. చివరగా రాష్ట్రంలో మంజూరైన ఏకైక ఫిషరీష్ కళాశాలను గద్వాల-వనపర్తి జిల్లాల మధ్య, కృష్ణానది పరివాహకంగా ఉండే పెబ్బేరు ప్రాంతంలో ఏర్పాటు చేయించారు. జీవనది కృష్ణా పారుదలను అనుసరించి విద్యార్థులకు అన్నిరకాలుగా అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

సమైక్యపాలనలో కేవలం 25 టీఎంసీల నీటికేటాయింపులున్న ఎంజీకేఎల్‌ఐకి తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డాకా 40 టీఎంసీల నీటి కేటాయింపులు చేయించిన పనిలో ముఖ్య భూమిక పోషించడం ద్వారా నేడు ఉమ్మడి జిల్లాలో సింహభాగం భూ ములన్ని పచ్చబడటం.. చెరువులన్నీ నీటితో నిం డుకుంటున్నాయి. అలాగే ఆర్డీఎస్‌కు ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్లను ఏర్పాటు చేయించడంలో అపన్నహస్తమందించి నడిగడ్డ రైతన్నకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఇప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధిలో నిరంజన్‌డ్డి వేసిన అడుగులను బట్టి నే డు కేబినెట్ మంత్రిగా మరోసారి ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించ డం పట్ల జిల్లా ప్రజానీకం హర్షం వక్తం చేస్తున్నది.

అంచెలంచెలుగా ఎదుగుతూ..
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అవమానాలను భరించారు. అనేక సవాళ్లు ప్రతిసవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. కష్టాలొచ్చినా.. ఆయన ఎత్తిన గులాబీజెండా కిందకు దించలేదు. ఉద్యమం ద్వారా ఎన్నో ప్రజా పాఠాలు ఒంటబట్టించుకున్న నేతగా అనుభవం గడించారు. మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా.. తెలంగాణ ఉద్యమంలో కీలకపావూతధారుడిగా నిలబడ్డ ఆయన జీవితం తెరచి ఉంచిన పుస్తకంలాంటిదే. పార్టీ కీలక బాధ్యతల్లో ఉంటూనే అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు 2004-2015లో కొల్లాపూర్, వనపర్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. తిరిగి 201 ఎన్నికల్లో నిరంజన్‌డ్డి ఘనవిజయం సాధించడంతో నేడు కెబినెట్‌లో మంత్రిగాను ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఖాదీ బోర్డు చైర్మన్‌గాను పని చేశారు. ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నేడు నిరంజన్ రెడ్డికి మరో అరుదైన అవకాశం లభించిందని మేథావులు, విజ్ఞులు అభివూపాయపడుతున్నారు.

రాజధానికి తరలిన నేతలు...
ఎమ్మెల్యే నిరంజన్‌డ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్‌కు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యేగా లేకున్నప్పుడే కేబినెట్ హోదాలో పని చేసి మెప్పు పొందిన నిరంజన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మంత్రి పదవి ఖాయం అని అందరు ఊహించారు. అనుకున్నట్లుగానే మొదటి ప్రాధాన్యతలోనే నిరంజన్‌డ్డికి మంత్రిగా అవకాశం రావడంతో పార్టీ వర్గాల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. రాజభవన్‌లో జరిగిన కార్యక్షికమాన్ని స్వయంగా తిలకించిన నాయకులు గ్రామాల్లో ఉన్న అనుచరులకు ఫోన్లు చేస్తూ సంబురం చేసుకున్నారు. నిత్యకృషీవలుడిగా నిలిచిన నిరంజన్ రెడ్డికి నియోజకవర్గ జనమంతా నీరాజనం పలుకుతున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...