ఘనంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర


Wed,February 20, 2019 03:02 AM

-శివాజీ వేషధారణలో చిన్నారులు
-బైక్ ర్యాలీ నిర్వహించిన యువకులు
వనపర్తి విద్యావిభాగం/వనపర్తి రూరల్ : ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో హిందువాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మంగళవారం రామాలయంలో పట్టణ యువకులు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని పట్టణంలోని రాజీవ్ చౌరస్తా, శంకర్‌గంజ్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా శోభయాత్ర చేపట్టారు. శోభాయావూతలో చిన్నారులు శివాజీ వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. అలాగే వనపర్తి మండలంలోని అంకూర్ గ్రామం లో హిందూవాహినీ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లుర్పించారు. అలాగే చిమనగుంటపల్లి గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలాలు వేసి శివాజీ వేడుకలను ప్రారంభించారు. కార్యక్షికమంలో హిందువాహినీ పట్టణాధ్యక్షుడు శివకృష్ణయాదవ్, శ్రీరాం, అనిల్, ఆర్యవైశ్య సంఘం నాయకులు చిరంజీవి, నరేష్, వరుణ్, గణేష్, ప్రవీణ్, సురేష్, నరేందర్, సాయి, రాఘావాచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం : మండల కేంద్రంతో పాటు మం డలంలోని ఆయా గ్రామాలలో శివాజీ జయంతిని పురస్కరించుకొని హిందువాహిని, ఆర్‌ఎస్‌ఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో మంగళవారం శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శివాజీ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హిందువాహినీ, ఆర్‌ఎస్‌ఎస్ మండలాధ్యక్షుడు నవీన్, భాస్కర్‌లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకొని దేశంకోసం పనిచేయాలన్నారు. అనంతరం పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్షికమంలో యాదగిరి, మహేష్, తనాజీబీమ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెద్దమందడిలో..
పెద్దమందడి : మండల కేంద్రంతో పాటు మండలంలోని దొడగుంటపల్లి, మద్దిగట్ల, పామిడ్డిపల్లి, జంగమాయిపల్లి తదితర గ్రామాలలో మంగళవా రం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యు వకులు శివాజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత్‌మాతకి జై అంటు నినాదాలు చేస్తూ వీధుల గుండా యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కార్యక్షికమంలో ఆయా గ్రామాల యువకులు రాఘవేందర్‌డ్డి, భాస్కర్, భానువూపకాష్, రమేష్, రాజు, ఆంజి, కురుమూర్తి, రాంచంవూదాచారి ఉన్నారు.

గోపాల్‌పేటలో..
గోపాల్‌పేట : మండల కేంద్రంతో పాటు మండలంలోని ఏదుట్ల, ఏదుల, పొల్కెపహాడ్ తదితర గ్రామాలలో మంగళవారం హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనం గా నిర్వహించారు. కార్యక్షికమంలో హిందూ వా హిని కార్యకర్తలు దిలీప్, కరుణాకర్, వినోద్, దామోదర్, రవితేజ, కురుమూర్తి, పరుశురాం, శ్రీకాంత్, ధర్మయ్య, మల్లిఖార్జున్, కవి, గోపాల్, బాల్‌రాజు, కృష్ణయ్య, శివకుమార్, బాలకృష్ణ పాల్గొన్నారు.

పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు టౌన్ : పెబ్బేరు కేంద్రంలో హిందూ ధర్మ సేవాసమితి, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి ఛత్రపతి శివాజీ శోభయాత్ర కార్యక్షికమాన్ని ప్రారంభించారు. వేడుకలకు హాజరైన యు వకులకు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో అల్పాహా రం అందించారు. కార్యక్షికమంలో ఆరెకటిక సం ఘం సభ్యులు, హిందూ వాహిని నాయకులు వేమాడ్డి, విజయవర్ధన్ రెడ్డి, సహాదేవుడు, అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి అధ్యక్షుడు ప్రదీప్, ప్రచార కార్యదర్శి బాలవర్ధన్, హిందూ ధర్మ సేనా సభ్యులు, ఆర్‌ఎస్సెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ శోభయావూతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెబ్బేరు ఎస్సై విజయ్‌కుమార్ గట్టి బందోబస్తు నిర్వహించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...