అదృశ్యమైన వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యం


Wed,February 20, 2019 03:01 AM

ఊర్కొండ : మతిస్థిమితం లేక కనిపించకుండ పోయిన వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యమైన ఘటన మంగళవారం ఊర్కొండ మండలంలో చోటు చేసుకుంది. ఊర్కొండ ఏఎస్సై శ్రీనివాస్‌డ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాధారం గ్రామానికి చెందిన మహబుబ్ అలీ గత నెల 20 వ తేదీన తన పొలం దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిన వ్యక్తి రాక పోవడంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గత నెల 22వ తేదిన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మమబుబ్‌అలీ మిస్సైనట్లు కేసు నమోదు చేశారు. పోలీసులు గాలించిన అతని ఆచూకీ లభించలేదు. మంగళవారం మధారం శివారులో గల పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తులకు చెరువులో మృతదేహం కన్పించడంతో, వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహం బయటకు తీసి, అది గత నెల ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైన మాధారం గ్రామానికి చెందిన మహబుబ్‌అలీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టర్ నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకి తరలిచారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెల్లడించారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...