ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు


Mon,February 18, 2019 03:05 AM

వనపర్తి అర్బన్/ రూరల్ : తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా దవాఖానలో టీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వారు గుర్తు చేశారు. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కారించుకొని సర్పంచ్ కోండయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపా రు. ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో సర్పంచ్ కోండయ్య, ఎంపీటీసీ నర్సింహాగౌడ్‌లు మొక్కలను నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మ న్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు లోన్‌నాథ్‌రెడ్డి, రమేష్‌నాయక్, నాయకులు లక్ష్మీనారాయణ, రాజు, గులాంఖాదర్, గిరి, మురళీసాగర్, రాములు యాదవ్, తిరుమల్, విష్ణుసాగర్, కురుమూర్తి యాదవ్, నాగమ్మ, కవిత, పరంజ్యోతి, పెద్దగూడెం ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, వార్డు సభ్యులు రామన్‌గౌడ్, శ్రీను, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీను, వేణయ్యగౌడ్, బుచ్చిబాబు, ఆశోక్, శేఖర్, చోట్, సాయిరాంగౌడ్, మణ్యం, వెంకట్రామ్‌లు, వెంకటయ్యగౌడ్, యాదగిరిరెడ్డి, సురేష్, తిరుపతయ్య, కృష్ణయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...