డిజిటల్ వనపర్తి షురూ..


Sun,February 17, 2019 04:09 AM

వనపర్తి అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను సాంకేతికంగా విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సహకారంతో శ్రీకారం చుట్టిన డిజిటల్ వనప ర్తి కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. తొలి రోజు శిక్షణలో భాగంగా కంప్యూటర్ బేసిక్స్ నుంచి కీలక అం శాలపై అవగాహన కల్పించారు. టీటా ఆధ్వర్యంలో చే పట్టిన ఈ యాత్రను కలెక్టర్ శ్వేతామొహంతి ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో డిజిటల్ లిటరసీని పెంపొందించేందుకు రెండు రోజుల పాటు టీటా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. టీటా డిజిటల్ వనపర్తి పేరుతో వనపర్తి జిల్లాలోని 137 పాఠశాలల్లోని 12,139 విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో వివిధ నైపుణ్యాలపై శిక్షణ అందించేందుకు హైదరాబాద్ నుం చి బృందంగా ఏర్పడి ఇక్కడ శిక్షణ ఇస్తున్నది. కంప్యూటర్ బేసిక్స్, ఈ మెయిల్ ఏర్పాటు, గూగుల్ సెర్చ్ వం టి వాటిపై అవగాహన కల్పించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని విద్యార్థులతో వనపర్తి జిల్లాలోని హాస్టళ్ల విద్యార్థులు వీడియోకాల్ ద్వారా అనుసంధానమయ్యారు. దక్షిణాఫ్రికా టీటా అధ్యక్షుడు కిశోర్ పుల్లా రి, అక్కడ నివసిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు రఘు సమన్వయంతో సాగిన ఈ ఇష్టాగోష్టి విద్యార్థులను ఆకట్టుకుంది. అనంతరం మెక్సికో దేశంలోని పిల్లలతో ఇం టరాక్ట్ అయ్యారు.

మెక్సికో ఉపాధ్యక్షుడు రమేశ్ వీడి యో కాల్‌లో మెక్సికో విద్యావిధానం గురించి ప్రదర్శించారు. దీని అనంతరం అమెరికన్ పుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ బండా రోణిత్ ఆధ్వర్యంలోని ఏడుగు రి బృందం చిన్నారులకు అమెరికన్ ఫుట్‌బాల్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏడుగురి బృందానికి రోణిత్ నాయకత్వం వహించారు. అనంతరం 150 మంది టెకీలు శనివారం రాత్రి హాస్టళ్లలో నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. చాట్ ఓవర్ క్యాంప్ ఫైర్ నిర్వహించారు. విద్యార్థులతో పలు అంశాలపై ఇ ష్టాగోష్టిగా చర్చించారు. టీటా గ్లోబుల్ ప్రెసిడెంట్ సందీ ప్ మక్తాల సారధ్యంలోని యువ టెకీల బృందం తమ జిల్లాకు విచ్చేయడం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనేక అంశాలపై శిక్షణ కల్పించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం రెండు రోజుల పాటు సమయం వెచ్చించడం, హాస్టళ్లల్లోనే నిద్రించడం సం తోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి కలెక్టర్ శ్వేతామొహంతి వివిధ పాఠశాలల్లో డిజిటల్ వనపర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...