గుర్తు తెలియని యువతి ఎముకలు లభ్యం


Sun,February 17, 2019 03:35 AM

-రంగంలో దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు
లింగాల : మండలంలోని కొత్తకుంటపల్లి శివారులో గల పెద్ద గుట్టలో గుర్తు తెలియని యువతి(20) అనుమానా స్పద రీతిలో మృతి చెందగా ఆమె అవయవాలు, వస్తువులు శనివారం లభ్యమయ్యాయి. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తప్పిపోయిన మేకలను వెతుకుతూ గొర్రెల కాపారులు ఘటనా స్థలానికి చేరుకొగా అక్కడ ఎవరో చనిపోయినట్లు గుర్తించి వీఆర్‌వోకు తద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఈ స్థలాన్ని పరిశీలించగా 40 రోజుల క్రితం సుమారు 20 ఏళ్ల యువతి మృతి చెందగా ఆమె పుర్రె, పక్క టెముకలు, వెంట్రుకలు, సగం కాలిన చుడిదార్, చెప్పులు, కాళ్ల పట్టీలు లభ్యం అయ్యాయి. ఆనవాళ్ల కోసం లింగాల, అచ్చంపేట ఎస్సైలు మోహన్, పరశురాములు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఐ పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...