రైలు కింద పడి వృద్ధుడి దుర్మరణం


Sun,February 17, 2019 03:34 AM

గద్వాల క్రైం : పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడు అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రం గద్వాలలో శనివారం చోటు చేసుకున్నది. గద్వాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాలలోని చింతలపేటకు చెందిన వెంకట్రాములు (74) మానసికంగా గత కొంత కాలం గా బాధపడుతున్నాడు. వెంకట్రాములు భార్య పద్మ మ్మ స్థానికంగా ఫస్ట్ రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఓ వాహన షో రూంలో వాచ్‌ఉమెన్‌గా పని చేస్తోంది. శనివారం తెల్లవారుజామున తన భార్య దగ్గరికి వెళ్లేందుకు వెంకట్రాములు ప ట్టాలు దాటుతుండగా అదే సమయం లో గుర్తు తెలియని రైలు వచ్చి వెంకట్రాములును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యన అక్కడిక్కడే దుర్మరణం చెందాడని హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకట్రాములు మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించామని, మృతుని భార్య పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...