డీసీసీ కార్యాలయం ఎదుట.. కార్యకర్తల ఆందోళన


Sat,November 17, 2018 02:02 AM

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్ : దేవరకద్ర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌ను డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు డీసీసీ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. దేవరకద్ర టికెట్ పవన్‌కుమార్‌రెడ్డికి ఇవ్వ డం లేదనే సామాచారం తెలిసిన వెంటనే నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. డీసీసీ కార్యాలయంలో ప్రత్యే క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శులు అరవింద్‌కుమార్‌రెడ్డి, విశ్వేశ్వర్, కొత్తకోట జడ్పీటీసీ విశ్వేశ్వర్ మా ట్లాడుతూ ఇన్ని రోజులు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారిని విస్మరించి ఇతరులకు టికెట్‌ను కేటాయించడం సరికాదన్నారు. కూటమి పేరుతో కాలయాపన చేసి గడువు సమీపించిన తరుణంలోను ఆశావాహులకు టికెట్లు కేటాయించక పోవడం దా రుణమన్నారు. డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసి కూటమి అభ్యర్థులను ఓడిస్తామని స్పష్టం హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉమా మహేశ్వర్‌రెడ్డి, ఉంద్యాల వెంకటేశ్వర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, బాల నర్సింహులు, అనిల్‌కుమార్‌రెడ్డి, నాగిరెడ్డి, నర్సింహారెడ్డి, గోవర్దన్‌గౌడ్, శెట్టి శేఖర్, ఫసియోద్దీన్, శ్రావణ్‌కుమార్, వెంకటేష్, రవికుమార్, శ్రీకాంత్‌రెడ్డి, మహేష్, బాల్‌రాజ్, సుభాష్, జగదీశ్వర్, వేణుగోపాల్, ప్రశాంత్, ఆనంద్ ఉన్నారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...