కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ


Fri,November 16, 2018 12:41 AM

-నాలుగున్నర ఏళ్లలోనే దేశంలోనే నెంబర్‌వన్‌గా అభివృద్ధి
-సమైక్య పాలకులు దోచుకున్నారు
-టీఆర్‌ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
-మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
-వనపర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-ఆయన సమక్షంలో కారెక్కిన 220 మంది హమాలీలు..
-కొత్తకోటలో ఆల మంజుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి 100 మంది మహిళలు
వనపర్తి అర్బన్ : టీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలు, సంఘాల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నారు. గురువారం కౌన్సిలర్ లోక్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యూ గంజ్ హమాలీలు 130 మంది, వెంకటేశ్‌సాగర్ ఆధ్వర్యంలో గోడౌన్స్ హమాలీలు 30మంది, ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 40మంది సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆయన సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీటీ రోడ్లు, పట్టణంలో సీసీరోడ్లను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో నంబర్‌వన్‌గా అభివృద్ధి చేశారన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్, కౌన్సిలర్ వాకిటి శ్రీధర్, నాయకులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, కృష్ణయ్య, నందిమల్ల శ్యాం, మురళీసాగర్, లతీఫ్ ఉన్నారు.

ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తా..
పెబ్బేరు : రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు ప ట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెం దిన మాజీ వార్డుమెంబర్ కందూరు కృష్ణారెడ్డి కుమారుడు రాఘవేందర్ రెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మా జీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చారెడ్డి, సంబు రవి, నాగరాజు, శ్రీకాంత్, దిలీప్ బాయ్ ఉన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...