అఖండ విజయం అందించండి


Fri,November 16, 2018 12:41 AM

వనపర్తి అర్బన్: డిసెంబర్ 7న జరిగే శాసనసభ ఎన్నికల్లో వనపర్తిలో అఖండ విజయాన్ని అందించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వార్డు ప్రజలను కోరారు. గురువారం రాత్రి వనపర్తి పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్ ఆవుల రమేష్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి నిరంజన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిరంజన్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో మహిళలలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. కాలనీలలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి అఖండ విజయం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని, టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గమనించాలని ఆయన ప్రజలను కోరారు. 70 ఏండ్లు పాలించి తెలంగాణను ఆగం చేసిన పార్టీలు ఏకమై తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నాయన్నారు. దీన్ని ప్రజలు గమనించి ఓటు వేయాలన్నారు. వార్డులో పర్యటిస్తున్న నిరంజన్‌రెడ్డికి మహిళలు బిట్టుపెట్టి ఆశీర్వదించారు. కొన్ని చోట్ల శాలువా పూలమాలలతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, కాగితాల గిరి, పరంజ్యోతి, మురళీసాగర్, చుక్క రాజు, సూర్యవంశం గిరి, బీచుపల్లియాదవ్, కురుమూర్తి, జోహెబ్, రాము, మహేష్, మోహ న్, శివ, విష్ణుసాగర్, యుగంధర్, శ్రీకాంత్‌రెడ్డి, బిట్టుయాదవ్, గులాంఖాదర్ ఉన్నారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...