ఎన్నికల నిబంధనలు పాటించాలి


Fri,November 16, 2018 12:40 AM

-కలెక్టర్ శ్వేతా మొహంతి
-చెన్నూరు, చాలక్‌పల్లి, కేశంపేట, చీర్కపల్లిలో పోలింగ్ స్టేషన్ల తనిఖీ
-ఓటర్లకు కల్పించిన వసతులపై ఆరా..
-దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్ల పరిశీలన
గోపాల్‌పేట/రేవల్లి : డిసెంబర్ 7న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మండలంలోని చెన్నూరు, చాలక్‌పల్లి పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వసతులను పరిశీలించారు. ఓటు వేసేందుకు వచ్చే వారికి బూత్‌ల వద్ద ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా చూడాలని తహసీల్దార్ రాధాకృష్ణను ఆదేశించారు. కేంద్రాల వద్ద

అవసరమై కనీస వసతులు కల్పించాలన్నారు.
రేవల్లి మండలంలోని కేశంపేట, చీర్కపల్లి గ్రామాల్లోని మూడు పోలింగ్ కేంద్రాలను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వసతులున్నాయా? అని ఆమె పరిశీలించారు. దివ్యాంగ ఓటర్ల వివరాలను బూత్‌లేవెల్ ఆఫీసర్లతో అడిగి తెలుసుకున్నారు, పోలింగ్ స్టేషన్‌లో ఓటరుకు ఇబ్బంది కలగకుండా కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చక్రపాణి, గిర్దావరి రాఘవేందర్‌గౌడ్, వీఆర్‌వోలు, బీఎల్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...