కాంగ్రెస్ హయాంలో


Fri,November 16, 2018 12:40 AM

మక్తల్, నమస్తే తెలంగాణ : పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని కృష్ణ మండలం మురహర దొడ్డి పథక ఆయన పరిశీలించారు. అనంతరం ఐడీసీ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ 48 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీలేదన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సాగునీరు లేక రైతులు వలసబాట పట్టారన్నారు. పాలమూరు చుట్టూ కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్న ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. అసంపూర్తి, కోసం ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బురన్‌దొడ్డి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా సాగునీరు అందించడంలో కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యం వల్ల రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. నాలుగున్నర టీఆర్‌ఎస్ పాలనలో రిజర్వాయర్లను పూర్తి చేసి సాగునీరు అందించడం జరిగిందన్నారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్ రిజర్వాయర్ సాగునీరు అందిస్తున్నామన్నారు. దీంతో వలసలు వెళ్లిన రైతులు సొంత ఊర్లకు చేరుకొని పంటలు పండించి సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ హు శ్రీరాం సాగర్, శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని తెలిపినా కాంగ్రెసొళ్లు పట్టించుకోదన్నారు.ప్రస్తుతం మంత్రి హరీశ్‌రావు చొరవతో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు పుష్కలంగా అందజేయడం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి ఎత్తిపోతల పథకంద్వారా పంటలకు పూర్తిస్థాయిలో విడదల చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఐడీసీ అధికారులు, రైతులు ఉన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...