నామినేషన్లు షురూ..


Thu,November 15, 2018 01:30 AM

-తల్లి తారకమ్మ ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన నిరంజన్‌రెడ్డి
-నామినేషన్ దాఖలు చేసిన వనపర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి
-పామాపురం ఆంజనేయస్వామి ఆలయంలో ఆల పూజలు
-దేవరకద్రలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
-వనపర్తిలో ఇండిపెండెంట్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి..
వనపర్తి నమస్తే తెలంగాణ ప్రతినిధి : శాసన సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. వనపర్తిలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, దేవరకద్రంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడో రోజుకు చేరగా.. బుధవారం నామినేషన్లు ఊపందుకున్నాయి. వనపర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి బుధవారం ఉదయం తన స్వగృహంలో తల్లి తారకమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఖిల్లాఘణపూర్ మండలం గట్టుకాడి పల్లిలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో భార్య వాసంతి, కూతుళ్లు ప్రత్యూశ, అమృతవర్షిణి, పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ దేవాలయంలోనూ పూజలు చేశారు. రెండు చోట్లా నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా వనపర్తి ఆర్డీవో కార్యాలయం చేరుకుని మధ్యాహ్నం 2:45 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. నిరంజన్‌రెడ్డి నామినేషన్‌ను రాజశేఖర్, సాయిప్రసాద్, రఘువంశి కాటగౌని, రాజకుమార్ రెడ్డి, అనిల్‌కుమార్, రాజప్రకాశ్‌రెడ్డి, మేఘారెడ్డి ప్రతిపాదించారు. నామినేషన్ వేస్తున్న సమయంలో నిరంజన్ రెడ్డి వెంట టీఆర్‌ఎస్ పార్టీ నేతలు గట్టు యాదవ్, మేఘారెడ్డి, రాజా ప్రకాష్ రెడ్డి, న్యాయవాది చంద్రశేఖర్ రావు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ నేత అభిలాశ్ రంగినేని, నేతలు లకా్ష్మరెడ్డి, మాణిక్యం, వెంకట్రావు, గౌని బుచ్చారెడ్డి, రవి, కొత్త రామారావు, వాకిటి శ్రీధర్, లోక్‌నాథ్‌రెడ్డి, ఆవుల రమేశ్ పాకనాటి కృష్ణ, భువనేశ్వరి, కమలమ్మ, ఇందిర, ప్రమీలమ్మ, నర్సింహ తదితరులున్నారు.

ప్రత్యేక పూజల అనంతరం ఆల, చిట్టెం..
దేవరకద్ర నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కొత్తకోట మండలం పాంపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో భార్య మంజుల, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నామినేషన్ పత్రాలు ఉంచి దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్, మహబూబ్‌నగర్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు బస్వరాజు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషులతో కలిసి దేవరకద్ర చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ దాఖలు చేశారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మక్తల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌లోని పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ంలో పూజల అన ంతరం నామినేషన్ దాఖలు చేశారు. నా మినేషన్ కార్యక్రమాని కి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.

వనపర్తి నుంచి ఇండిపెండెంట్..
వనపర్తిలో బుధవారం తొలి నామినేషన్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థి బూజుల వెంకటేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. ఆర్టీవో కార్యాలయంలో రిటర్ని ంగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందచేశా రు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా.. రెండు రోజుల పాటు నామినేషన్లు దాఖలు కాలేదు. బుధవారం నిరంజన్‌రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...