నమ్ముకుంటే ...నట్టేట ముంచే


Thu,November 15, 2018 01:29 AM

-కూటమిపై తెలంగాణ జనసమితి నేతల ఆగ్రహం
-కోదండరాం నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపణ
-మహాకూటమి ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం
-కాంగ్రెస్‌కు టీజేఎస్ నాయకుల షాక్
-స్వతంత్రంగా పోటీ చేస్తామంటూ ప్రకటన
వనపర్తి నమస్తే తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ జన సమితి స్థాపించినప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్ర కటించిన ఆ పార్టీ అధినేత కాంగ్రెస్, టీడీపీలతో కలిసి మహాకూటమిలో చేరి నట్టేట ముంచాడని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోదండరాం తీరును ఆ పార్టీ నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కేసీఆర్ నియంత అంటూ అభివర్ణించే కోదండరామే అతి పెద్ద నియంత అని విమర్శిస్తున్నారు. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షులతో సంప్రదించకుండా కూటమితో జతకట్టి తమను వంచించాడు, ఏదో సాధిస్తామంటూ పార్టీ పెట్టి చివరకు తమనందరినీ రోడ్డుపై నిలబెట్టాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన కోదండరాం ఇప్పుడు అదే పార్టీతో కలిసి పనిచేయడం తమకు అవమానంగా ఉందని, మహాకూటమి ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో లేదు చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిందని వారంటున్నారు. ఏ బాబునైతే వద్దనుకున్నామో అదే బాబు లీడ్ చేసే కూటమిలో భాగంగా ముం దుకు వెళ్లడం అసాధ్యమని టీజేఎస్ నేతలు అం టున్నారు. గతంలో వివిధ పార్టీల్లో ఉన్న తాము కోదండరాంను నమ్ముకుని టీజేఎస్‌లోకి వస్తే తమకు మంచి గుణపాఠమే నేర్పాడని అంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ టిక్కెట్ ఆశించిన ఆ పార్టీ నేత, మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి కోదండరాంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ సైకిల్ గుర్తు అయితే వద్దనుకున్నామో అదే గుర్తు అభ్యర్థికి టిక్కె ట్ వస్తే ఎలా పనిచేస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు సైతం జరిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీజేఎస్ పార్టీ పరిస్థితి అదే విధంగా ఉంది. కార్యకర్తలు, నేతలకు ప్రస్తుతం పరిస్థితి అంతుచిక్కడం లేదు. మహబూబ్‌నగర్, మక్తల్‌లో టీడీపీకి కూటమి టిక్కెట్లు కేటాయించడంతో వారంతా నిరుత్సాహానికి గురువుతున్నారు. తెలంగాణ నుంచి అంతర్థానం అవుతుందని భావించిన పార్టీకి, తెలంగాణకు అడుగడుగునా వ్యతిరేకంగా పనిచేసే బాబుతో పాటు తామంతా ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు.

ఉద్యమకారుల జీవితాలతో చెలగాటం
తెలంగాణ ఉద్యమంలో భాగంగా వివిధ రూపాల్లో పనిచేసిన నేతలు పలువురు కోదండరాం పార్టీ టీజేఎస్‌లో చేరారు. సొంతంగా డబ్బులు ఖర్చు చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందని ఆశించారు. తీరా ఎన్నికల ప్రకటన రావడంతో కోదండరాం తన ఊసరవెళ్లి రూపా న్ని బయటపెట్టుకున్నాడని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అన్ని స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పిన కోదండరాం చివరకు కొన్ని సీట్లకు ఆశపడి కాంగ్రెస్ ఏర్పాటు చేసి న మహాకూటమిలో చేరాడని ఆరోపిస్తున్నారు. కనీసం పార్టీ జిల్లా అధ్యక్షులతో సం ప్రదించకుండా ఏకపక్షంగా కూటమిలో చేరాడని ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో టీజేఎస్‌లో చేరితే త మను ఆటలో అరటి పండు లా మార్చేశాడని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు కూడా కనీసం కోదండరాం సమయం, అవకాశం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. తెలంగాణకు ఆది నుంచి వ్యతిరేకంగా ఉన్న బాబుతో కలిసి పని చేయడం తమ వల్ల కాదని టీజేఎస్ నేతలు అంటున్నారు. కోదండరాంకు, కూటమికి గుణపాఠం చెప్పేందుకు పోటీ అభ్యర్థులుగా ఉండి తమ సత్తా చాటుతామని వివరిస్తున్నారు. ప్రస్తుతం మహాకూటమి కాంగ్రెస్ చేతుల్లోంచి చంద్రబాబు చేతిలోకి వెళ్లిందని... తెలంగాణలోనూ చంద్రబాబు చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని టీజేఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి తాము సహించబోమంటున్నారు.

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...