ప్రతి పనిలో సైన్స్ దాగుంది


Thu,November 15, 2018 01:29 AM

వనపర్తి విద్యావిభాగం : చేసే ప్రతి పనిలో సైన్స్ గ ణిత భావనలు దాగి ఉన్నాయని, నిష్ఠమైన పరిశీలన, ఆలోచనతో అద్భుతమైన ఆవిష్కరణలు చేయవచ్చని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించి న 46వ జాతీయ వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన గా వించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ గణిత భావనలు, కోణాలు, భౌతిక శాస్త్రంలోని ధ్వని ఆధారంగానే నృత్య భంగిమలు, కదలికలు, వేగం, ఖచ్చితత్వం జత కలిస్తేనే నృత్యం అద్భుతంగా ఉంటుందని, వాటిని నిశితంగా పరిశీలించి ఆలోచిస్తే అందులోనే సైన్స్ గణిత భావనలు ఉత్పన్నమవుతాయన్నారు. గణితంలో సైన్స్ అంటే పిల్లల్లో భయం ఉం టుందని, వాటిని అభ్యాసన, అనుకరణ ద్వారా సాధించవచ్చని అన్నారు. పరిశీలించిన అంశాలను ఆలోచించి, చర్చించి కొత్త ప్రయోగాలు చేయాలని సూచించారు. పని అనుభవం ద్వారా అభ్యాసన సులభతరమై సరైన అవగాహన పెంపొందుతుందన్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికి ప్రయోగాలు, కృత్యాలు చేయడంతో తాము స్వంతంగా చేస్తున్నామనే భావన ఉంటుందన్నారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శలు ఎక్కడిక్కడ విస్తృతంగా జరగాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వనపర్తి ప్రతిభను చాటాలని కోరారు. అనంతరం డీఈవో సుశీందర్‌రా వు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ ధోరణులు పెం పొందించడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సైన్స్, గణిత భావనలు విద్యార్థుల్లో పెంపొందించేందుకు ప్రతి ఏడాది ప్రారంభంలో వందేమాతరం ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన పట్టికలను ప్రతి పాఠశాలకు అందజేశామని, ఓ టమి విజయానికి నాంది అని స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

ఆకట్టుకున్న బాలభవన్ ప్రదన్శనలు..
వైజ్ఞానిక ప్రదర్శనలో భారతీయ సాంస్కృతిక, సాంప్రదాయలను ప్రతిబింబించే బాలభవన్ విద్యార్థులు కుచుపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చారు. పేద విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడం పట్ల డీఈవో సుశీందర్‌రావు, బాలభవన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.
అబ్బురపరిచిన సైన్స్ ప్రదర్శనలు..
మొదటి రోజు నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనలు పలువురిని అబ్బురపరిచా యి. మొత్తం 145 ప్రదర్శనలు నమోదు కాగా, అం దులో 6 విభాగాలలో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసా యం విభాగంలో 19, ఆ రోగ్యం, పరిసరాల పరిశుభ్ర త అంశంలో 29, వనరుల నిర్వహణలో 40, వ్యర్థ ప దార్థాల నిర్వహణలో 17, గ ణిత నమునాలో 30, రవా ణా, సమాచార ప్రసరణ వి భాగంలో 11 ప్రదర్శనలు ప్రదర్శించారు. ప్రదర్శనను ముందుగా కలెక్టర్ ప్రారంభించి ఎంతో ఆసక్తిగా తిలకించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీతో మదనాపురం విద్యార్థులు ప్రదర్శించిన మొబైల్ ద్వారా విద్యుత్ మోటర్ నిర్వహణ ఆకట్టుకుంది. మొబైలింగ్ ద్వారా మోటర్ ఆన్, ఆఫ్, నేలలో తేమశాతం తెలపడం, సోలార్ ఎనర్జీతో వ్యవసాయం, భూగర్భ జలాలను గుర్తించడం, మొబైల్ ద్వారా ఆపరేటర్ చేయడం, ఎస్‌ఎమ్‌ఎస్‌లను చేరవేయడం లాంటి వాటిని ప్రదర్శించారు. ఎక్కువ భాగం వర్షపు నీరు, డ్రైన్ వాటర్, స్టోరేజీ, రీసైక్లింగ్, వ్యర్థాలను కంపోస్ట్ చేసి ఎరువులు గా మార్చడం లాంటి ప్రదర్శనలు ఎక్కువగా వచ్చా యి. అదేవిధంగా ఎన్నికల సీజన్ సందర్భంగా పలు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎలక్ట్రికల్, ఓ టింగ్ యంత్రాల వినియోగం, వీవీప్యాట్ వినియోగం ప్రదర్శనలు ప్రదర్శించారు. జగత్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు స్మార్ట్ రోడ్డు ఫిన్లాండ్ దేశంలో అ మలవుతున్న విధానా ్న ప్రదర్శనలో ఉంచారు. కొత్తకోట బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు విద్యు త్ నిరూపయోగం కాకుండా ఒకేచోట నైట్ స్ట్రీల్‌లైట్లను ఆపరేట్ విధానం చేసే ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయంలో అడవి పందులు, మానవులు మృతి చెందకుండా మొబైల్ ఆపరేటింగ్ ప్రత్యేక సైరన్‌తో వంటివి ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు గణేష్ చంద్రశేఖర్, నోడల్ అధికారిణి వరలక్ష్మీ, పరీక్షల విభాగాధిపతి మధుకర్, డీఎస్‌వో, హెచ్‌ఎం గాయత్రి, ఇతర పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలు పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...