దేశం చూపు తెలంగాణ వైపు..


Thu,November 15, 2018 01:28 AM

-నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
వనపర్తి రూరల్/రేవల్లి : దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని వనపర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రేవల్లి మండలంలోని గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన 25 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ గ్రామాధ్యక్షుడు సింగిరెడ్డి సురేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిరంజన్‌రెడ్డి స్వగృహంలో ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో జనరంజక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దీంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. కాంగ్రేస్ సీట్లలొల్లి పూర్తికాక గాంధీభవన్‌ను గాంధీ దవాఖానగా మార్చారని, వారికి అధికారం ఇస్తే రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో కృష్ణ, శేఖర్, కుర్మయ్య, మల్లయ్య, సైదులు, శంకర్, సత్యం, మహేశ్వరం, ఎరుకలి పరశురాములు, చిన్నరామకృష్ణ, యాతం చిన్నయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో లోడె రఘు, బిచ్చిరెడ్డి, శశిధర్‌రెడ్డి, మహేశ్, నీలవర్ధన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అలాగే వనపర్తి పట్టణంలోని 15వ వార్డుకు చెం దిన 30 మంది యువకులు నిరంజన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో ప్రకాష్, మహేష్, కిశోర్, అజయ్, ప్రవీణ్, దినేష్, శ్యాం, శివ, నవీన్, రాజేందర్, తిరుపతి, కిట్టు, భరత్, భాను, గౌతం, అనిల్, శివ, సయ్యద్ తదితరులున్నారు. కార్యక్రమంలో అభిలాష్, మహేష్, జోహెబ్ తదితరులు పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...