ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయండి


Thu,November 15, 2018 01:26 AM

-కలెక్టర్, ఎన్నికల అధికారి శ్వేతామొహంతి
-అధికారులతో సమీక్ష
వనపర్తి రూరల్ : డిసెంబర్ 7న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్వేతామొహంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాం బర్లో వెబ్ కాస్టింగ్, పోలింగ్ సిబ్బంది, ఓ టర్ గుర్తింపు కార్డుల స్టేటస్, పోలింగ్ కేం ద్రాల వద్ద ఓటర్ సహాయక కేంద్రాల ఏ ర్పాటు తదితర అంశాల పై సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ను వెబ్ కాస్టింగ్ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సొంతంగా ల్యాప్ ట్యాప్ కలిగి ఉండాలని, బీ.టెక్, బీఎస్సీ కంప్యూటర్, బీసీఏ, బీకాం కంప్యూటర్, ఎంసీఏ అర్హత కలిగిన వారు కార్యాలయంలోని జిల్లా మేనేజర్‌ను సంప్రదించాలని లేదా http//wanaparthy.telangana.gov.in/selections ద్వారా పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకుగాను ఒక్కో అభ్యర్థికి రూ.60 0తో పాటు రవాణా, భోజన సదుపాయ ం కల్పిస్తామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫోటో ఓటర్ స్లిప్పులను తయారు చేయించాలని, ఈవీఎంల రెం డో విడత ర్యాన్డమైజేషన్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షంచారు. కార్యక్రమం లో జేసీ డీ. వేణు గోపాల్, రిటర్నింగ్ అధికారి చంద్రారెడ్డి పాల్గొన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...