సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలు


Wed,November 14, 2018 01:57 AM

వనపర్తి అర్బన్ : నియోజక వర్గంలో రోజురోజుకు కారు జోరు పెరుగుతుందని, నాటి సంక్షేమ పథకాలే నేడు ప్రచార అస్ర్తాలని టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్, టీఆర్‌ఎస్ అమెరికా యూత్ ప్రెసిడెంట్ రంగినేని అభిలాష్‌లు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వనపర్తి పట్టణంలోని 19వ వార్డులో టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వారు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్న వారిని పలకరిస్తూ వారి యోగక్షేమాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. వనపర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎల్లప్పుడూ నియోజకవర్గంను ఎలా అభివృద్ధి చేయాలో, రైతులకు ఎలా సాగునీరు అందించాలంటూ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి అని అలాంటి నాయకుడిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వారు ప్రజలను కోరారు. వనపర్తి పట్టణంను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పనులు చేస్తున్నారన్నారు. పట్టణ ప్రజల కోసం రూ.4కోట్లతో ఎకో పార్క్‌ను, రూ.20 కోట్లతో పార్కుల సుందరీకరణ రోడ్లును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంటి పనులు జరుగుతున్న వద్ద మహిళా కార్యకర్తలు ఇసుక జల్లెడు పట్టి తమ విలువైన ఓటును కారు గుర్తుకు వేసి నిరంజన్‌రెడ్డిని గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ప్రచారంలో కౌన్సిలర్లు నందిమల్ల భువనేశ్వరి, ఇందిరమ్మ, పార్వతమ్మ, ఎస్‌కె.ఖైరూన్, ప్రమీలమ్మ, నాయకులు లక్ష్మీనారాయణ, చుక్కరాజు, నందిమల్ల శ్యాం, దేవన్ననాయుడు, సత్యం, కృష్ణ, గిరి, ఎంఏ. లతీఫ్, మురళీసాగర్, విష్ణు సాగర్, వెంకటేష్, గౌసి ఖురేషి, మోహన్, పరంజ్యో తి, డానియల్, యుగంధర్‌రెడ్డి, పుష్పక్, రాము, జోహెబ్, అస్లాం బిన్ ఇస్మాయిల్, రాము, శివ, అశోక్, కురుమూర్తి, నాగమ్మ, జమ్ములమ్మ, లక్ష్మి తదితరులు ఉన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...