అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి


Wed,November 14, 2018 01:56 AM

-ఇంటింటి ప్రచారంలో సింగిరెడ్డి వాసంతి
పెద్దమందడి : రాష్ట్ర ప్రభుత్వం, వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని నిరంజన్‌రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి అన్నారు. మంగళవారం మండలంలోని పామిరెడ్డిపల్లి, ముందరితండా, చికర్‌చెట్టు తండా తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో నిరంజన్‌రెడ్డి గెలిపించాలని కోరారు. నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం తపనపడే గొప్ప నాయకుడు నిరంజన్‌రెడ్డి అని, నేడు మండలానికి కృష్ణమ్మ నీటిని తీసుకువచ్చి సస్యశ్యామలం చేసిన నాయకుడని ఆయనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాడని ఇంటింటి ప్రచారంలో గ్రామస్తులకు వివరించారు. ప్రతి కార్యకర్త ఆయనకు అండగా నిలిచి టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మెఘారెడ్డి, ఎంపీటీసీ నాగేందర్‌రావు, సింగిల్‌విండో అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్, బీంరెడ్డి, తిలక్, మహిళలు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...