ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లబ్ధి..


Wed,November 14, 2018 01:55 AM

పెబ్బేరు / పెబ్బేరు రూరల్ : పెబ్బేరులో వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలి చి విపక్ష పార్టీలను వీడి ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అంతకుముందు ఆయన మంగళవారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పా ర్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ పద్మావెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రానికి చెందిన తోగుట వీరక్షత్రీయులు 80 మంది, తాటిపాములకు చెందిన 30మంది, అదేవిధంగా పట్టణ కేంద్రానికి చెందిన పలువురు యు వకులు ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా లబ్ధి చేకూరిందన్నారు. తెలంగాణ ప్రజలంతా కారు గుర్తుకు ఓటువేసి ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించేందు కు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. పాముకు ముం గీసకు ఉన్నంత శత్రుత్వమని పదేపదే చెప్పుకొనే కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికల్లో ఎలా జతకట్టాయన్నారు.

స్పష్టత లేని కూటమిని తెలంగాణ ప్రజలు నమ్మేపరిస్థితి లేదని విమర్శించారు. రాను న్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే వనపర్తి నియోజక వర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరుస్తు సేవకుడి లా పని చేస్తానని తెలిపారు. అలాగే మండలంలో ని సూగూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటస్వామి, వేణుగోపాల్, మహాదేవుడు, ఎల్లయ్య, శివరాజుల ఆధ్వర్యంలో సుమారు వం ద మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వార ందరికీ నిరంజన్‌రెడ్డి గులాబీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ బుచ్చారెడ్డి, విశ్వరూపం, ఉమ్మడి మండలాల అధ్యక్షుడు హరిశంకర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ కట్ట శ్రీనివాస్‌రె డ్డి, ఎంపీటీసీలు శివశంకర్ గౌడ్, గోవిందు నా యుడు, నాయకులు గోపాల్, భానుప్రకాష్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, శివసాయి, ఎల్లయ్య, శేఖర్‌గౌడ్, సాయిరెడ్డి, బీటీ శివ, గోవిందు, ముస్తాక్, బీచుపల్లి, శాంతన్న, మణ్యం, జ్యోతి, భారతి, చిన్న నరసింహ, శ్రీనివాసులు, విజయ్, భాస్కర్, విజయ్‌బాబు, వెంకటేశ్వర్లు, పవన్, సాయిచంద్రుడు, ప్రసాద్, బాలరాజు, లచ్చన్న, సలేశ్వర్, తులసి, పుల్లయ్య, కృష్ణయ్య, రాంగోపాల్, నవీన్, ఆదినారాయణ, రవి, ధన్‌రాజ్, శివకుమార్, చిరంజీవి, క్రాంతికుమార్, రాజు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...