కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి


Tue,November 13, 2018 01:43 AM

-టీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేయాలి
-ఆదరిస్తే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా : నిరంజన్‌రెడ్డి
-మద్దతు తెలిపిన విశ్రాంత ఉద్యోగులు
వనపర్తి అర్బన్ : స్వరాష్ట్ర పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి మ రింత వేగంగా జరిగిందని వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులు నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లు తెలంగాణకు ఆంధ్రోళ్లు అన్యాయం చేశారని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని వివరించారు. తెలంగాణ రాకుండా, నీళ్లు రాకుండా అడ్డుపడే చంద్రబాబుతో కాం గ్రెస్ నాయకులు చేతులు కలుపి మహాకూటమిగా ముందుకు వస్తున్నాయన్నారు. వారికి తెలంగాణ అభివృద్ధి అవసరం లేదని, కేవలం పదవులు మాత్రమే కావాలన్నారు. రా ష్ట్రంలో, నియోజకవర్గంలో టీఇర్‌ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పదవి లేకున్నా సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో నాలుగున్నరేళ్లలో వనపర్తి పట్టణంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృదిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మీరందరూ ఎన్నికల్లో ఆశ్వీరదించి ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచుతానన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రవికుమార్, గౌని బుచ్చారెడ్డి , కౌన్సిలర్ రమేష్, నాయకులు ప్రేమ్‌నాథ్ రెడ్డి, మోహన్, రాము, గిరి తదితరులు ఉన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...