కనుల పండువగా అలంకరణోత్సవం


Tue,November 13, 2018 01:42 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : తెలంగాణ జిల్లాల్లో ప్రఖ్యాతిగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకార మహ్సోతవం సోమవారం కన్నుల పండుగగా సాగింది. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భద్రపరిచిన స్వామివారి స్వర్ణాభరణాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగించారు. అంతకుముందు బ్యాంకు మేనేజర్ నాగేంద్రప్రసాద్, ఆలయ ఈవో సురేందర్‌లు బ్యాంకు లాక ర్ నుంచి ఆభరణాల పెట్టెను బయటకు తీశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతమ్మ, సల్గుటి స్వర్ణ సుధాకర్‌రెడ్డిలు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మార్కెటింగ్ చైర్మన్ దేవరిమల్లప్పలు ముఖ్యఅథితులుగా హజరై బ్యాంకు లో లాంఛన ప్రాయంగా స్వర్ణాభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరచింత చేనేతల నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్వామివారి పట్టు వస్ర్తాలు బ్యాంకుకు చేరగానే వాటిని సహితం ఆభరణాలతో పూజలు నిర్వహించారు.

పండితుల ఆధ్వర్యంలో జరిపిన పూజల అనంతరం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గాడి వంశస్థులైన పీఏసీఎస్ అద్యక్షుడు గాడి కృష్ణమూర్తి కుమారుడు గాడి అశోక్‌కుమార్ మొదటి సారిగా ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకొని ఊరేగిం పు ప్రారంభించారు. స్వర్ణాభరణాలు బ్యాంకు బయటకు రాగానే గోవింద నామస్మరణంతో ఆత్మకూరు పట్టణం మార్మోగింది. బాజా భజంత్రీలు, కురుమ డోళ్లు, శివసత్తుల పూనకాలు, డీజే సౌండ్స్‌ల హోరు, భారీ పటాకుల మోతతో పట్టణం దద్ధరిల్లింది. అనంతరం పరమేశ్వరస్వామి చెరువుకట్టపై పరమశివుడి ఆలయానికి అభిముఖంగా మాజీ ఎమ్మెల్యేలు పూజ లు నిర్వహించి ఆభరణాలను పట్టణం నుంచి సాగనంపారు. ఊరేగింపు పొడవునా ఆత్మకూరు సీఐ బం డారు శంకర్, ఎస్‌ఐ జి. ముత్తయ్యల నేతృత్వంలో ఆత్మకూరు నుంచి దేవస్థానం వరకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఊరేగింపులో ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, కొత్తకోట ఎంపీపీ గుంతమౌనిక, మక్తల్ బీజేపీ అభ్యర్థి కొండయ్య, నర్వ జలంధర్‌రెడ్డి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, తహసీల్దార్ జేకే మోహన్, మున్సిపల్ కమిషన్, ఎంపీడీవో శ్రీపాద్, ఈవో హుస్సేనప్ప, వీఆర్వో యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

రాజకీయ నాయకుల సందడి
కురుమూర్తి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆత్మకూరులో ప్రారంభమైన ఆలంకార మహోత్సవ కార్యక్రమంలో రాజకీయ నాయకులు సందడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి దంపతులు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సల్గుటి స్వర్ణసుధాకర్‌రెడ్డి, స్టేట్ ట్రేడ్ మార్కెటింగ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్దమైన నర్వ జలంధర్‌రెడ్డిలు అలంకార మహోత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు పొడవునా ఎవరికి వారు తమ ప్రాబల్యాన్ని చాటేలా గ్రూపులతో పాల్గొన్నారు. ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఎవరికి వారు తమ సత్తా చూపించేలా కార్యకర్తల హడావుడిని ప్రదర్శించారు. సీతమ్మ, స్వర్ణసుధకార్‌రెడ్డిలైతే ఏకంగా జనాలకు తాము విజయం సాధస్తామనేలా విజయచిహ్నం ప్రదర్శిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...