నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తాం..


Tue,November 13, 2018 01:42 AM

ఖిల్లాఘణపురం : ఐక్యమత్యంతో పనిచేసి ఖిల్లాఘణపురం మండలం నుంచి భారీ మెజార్టీతో వనపర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరె డ్డి నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తామని ఎంపీపీ కృష్ణనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలాధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకట్రావులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు మండలానికి సాగునీరు తీసుకురాలేదని, గత ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డి ఓడిపోయినప్పటికీ సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గానికి సాగునీటితో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత నిరంజన్‌రెడ్డికే దక్కిందన్నారు. వెనుకబడిన, వలసలకు నిలయంగా ఉన్న ఖిల్లా మండలానికి రూ.109కోట్లతో సాగునీరు తీసుకువచ్చి ప్రతి పల్లెలో కుంటలు, చెరువులు కృష్టానీటితో అలుగులు పారుతున్నాయని అన్నారు. మండలంలోని 35వేల ఓట్లు ఉన్నప్పటికీ అందులో ఉన్న 25 వేల ఓట్లు నిరంజన్‌రెడ్డికే వేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖిల్లాఘణపురం మండలంలో నేడు నిరంజన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజ లు ముందుకు వస్తున్నారన్నారు. ప్రతి ఒక్క రూ టీఆర్‌ఎస్ సైనికులుగా పనిచేసి నిరంజన్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలన్నా రు. త్వరలోనే మండలంలోని ముఖ్య నాయకులతో చర్చించి గ్రామాల వారీగా ప్రచార కార్యాచరణను సిద్ధం చేస్తామని వారన్నారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ సభ్యులు కృష్ణయ్య, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జాత్రునాయక్, పీనానాయక్, సతీష్, శంకర్‌గౌడ్, గిరి, కృష్ణయ్య, సుజీవన్, పిల్యానాయక్ పాల్గొన్నారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...