పాదయాత్ర.. ప్రభంజనం


Mon,November 12, 2018 02:37 AM

గోపాల్‌పేట / రేవల్లి : మండలంలో టీఆర్‌ఎస్ నాయకుల పాదయాత్ర ప్రభంజనం కొనసాగుతుంది. వనపర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గెలుపు కోసం మండలంలోని అన్ని గ్రామాలు గిరిజ న తండాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు పాదయాత్రకు స్వాగతం పలుకుతూ టీఆర్‌ఎస్ వెంటే మేమున్నామంటూ పార్టీ నాయకులతో కలిసి అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నా రు. ఆదివారం మండల కేంద్రంతో పాటు చెన్నూరు, వెనికితండా, ముందరి తండా, బుద్దారం, పాటిగడ్డ తండా, ధర్మతండా, లక్ష్మీతండా, జాంప్లా తండా, పొల్కెపహాడ్, ఏదుట్ల గ్రామాల గుండా పాదయాత్ర చేశారు. రాత్రి ఏదుట్లలో బస చేశారు. అలాగే రేవల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహ్ముదాసలాం ఆధ్వర్యంలో ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొని చెన్నూరు, బుద్దారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని వచ్చేఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నిరంజన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఉమ్మడి మండల కోఆర్డినేటర్ కొత్త రామారావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతి యాదవ్, నాయకులు దొడ్ల రాములు, శ్రీనివాస్‌రావు, గోపాల్, మతీన్, బాల్‌రాజు, సందీప్, కోటీశ్వర్‌రెడ్డి, రాములు, శివకుమార్, కృష్ణారావు, రాములు, రవి, రాంబాబురావు, శ్రీనివాస్‌రెడ్డి, పరుశురాం, శేఖర్, శ్రావణ్, శివకుమార్, యాదగిరి, బాల్‌రాజు, శ్రీధర్‌రావు, ధర్మయ్య, జయపాల్‌రెడ్డి, క్రాంతి, గొర్ల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, రేవల్లి, నాగపూర్ గ్రామాధ్యక్షులు కర్రోల్లరాములు, దొడ్డికుర్మయ్య, కుర్మయ్య, పూర్ణకంటికిరణ్, గుట్టలయ్య, జబ్బునిరంజన్ యాదవ్ పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...